వచ్చే ఏడాది అంజలి పెళ్లి..?

హీరోయిన్ అంజలి పెళ్లిపై పుకార్లు రావడం కొత్తేంకాదు. గతంలో ఆమె ఆజ్ఞాతంలోకి వెళ్లినప్పుడు పెళ్లి చేసుకుందని చాలామంది భావించారు. ఆ తర్వాత ఓ డాక్టర్ ను ఆమె వివాహం చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. వాటిని స్వయంగా అంజలి ఖండించింది. ఈ రెండు ఎపిసోడ్స్ తర్వాత హీరో జై తో అంజలి క్లోజ్ గా ఉంటోందని వార్తలు వచ్చాయి. ఇది మాత్రం నిజం. ఇద్దరూ ఓ అపార్ట్ మెంట్ లో సహజీవనం చేస్తున్నారో లేదో తెలీదు కానీ, కలిసున్న ఫొటోలు మాత్రం చాలానే బయటకొచ్చాయి. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు వస్తున్నాయి.

వచ్చే ఏడాది అంజలి-జై వివాహం ఉంటుందట. ప్రస్తుతం అంజలి కొన్ని సినిమాలతో బిజీగా ఉంది. అగ్రిమెంట్ ప్రకారం ఆ సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత హీరో జైను పెళ్లాడుతుందట. ఈ విషయంపై అంజలి సైడ్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. జై మాత్రం నెక్ట్స్ ఇయర్ పెళ్లి ఉంటుందంటూ హింట్ ఇచ్చేశాడు.

చెన్నైలోని ఓ ఫ్లాట్ లో జై-అంజలి కొన్ని నెలలుగా కలిసి ఉంటున్నారు. ఈ విషయం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా అందరికీ తెలుసు. వీళ్లిద్దరూ ఒకే ఫ్లాట్ లో ఏకాంతంగా ఉంటున్న ఫొటోల్ని ఎవరో లీక్ చేశారు. ఆ తర్వాత నుంచి వీళ్లే స్వయంగా ఫొటోల్ని పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా తామిద్దరం సహజీవనం చేస్తున్నామనే విషయాన్ని జై-అంజలి కన్ ఫర్మ్ చేశారు. పెళ్లిపై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజోలులో పుట్టిపెరిగిన అంజలికి కోలీవుడ్ కలిసొచ్చింది. అలా అక్కడే ఆమె సెటిల్ అయిపోయింది. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ క్రేజ్ అంతంత మాత్రమే. తాజాగా ఆమె నటించిన చిత్రాంగద సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.

Show comments