మరోసారి హ్యాండ్ ఇచ్చిన మహేష్.. అసలేం జరుగుతోంది?

ఈ ఉగాది కోసం మహేష్ ఫ్యాన్స్ కళ్లుకాయలు కాచేలా ఎదురుచూశారు. తీరా ఉగాది వచ్చేసరికి అంతా ఒక్కసారిగా నీరుగారిపోయారు. దీనికి కారణం ఈరోజు మహేష్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాకపోవడమే. అవును.. ఈసారి కూడా ఫస్ట్ లుక్ రావట్లేదు. లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి ఇదిగో ఫస్ట్ లుక్.. అదిగో ఫస్ట్ లుక్ అని ఊరిస్తున్న యూనిట్.. చివరికి ఉగాది రోజున కూడా హ్యాండ్ ఇచ్చేసింది.

ప్రస్తుతం వియత్నాంలో ఉన్నాడు మహేష్. మురుగదాస్ దర్శకత్వంలో అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్  పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాతే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారట. బహుశా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో విడుదల చేసే అవకాశాలున్నాయంటున్నారు. లుక్ రిలీజ్ కాకపోవడానికి అసలు కారణం మాత్రం వేరే ఉంది.

మహేష్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ ఇన్నిసార్లు వాయిదావేయడానికి మెయిన్ రీజన్ సినిమా టైటిల్ ఫిక్స్ అవ్వకపోవడమే. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. సంభవామి, ఏజెంట్ శివ లాంటి టైటిల్స్ ప్రచారంలో ఉన్నప్పటికీ ఇంకా దేన్నీ ఫిక్స్ చేయలేదని తెలుస్తోంది. మరోవైపు ఫస్ట్ లుక్ స్టిల్ పై కూడా ఎలాంటి నిర్ణయానికి రాలేదట. సీరియస్ లుక్ రివీల్ చేద్దామా లేక సింపుల్ గా ఉండే మహేష్ ఫొటోనే ఫస్ట్ లుక్ కింద విడుదల చేద్దామా అనే డైలమా కూడా నడుస్తోంది.

Show comments