నరుడా ? డోనరుడా?

విక్కీ డోనార్..ఎప్పటి నుంచో టాలీవుడ్ లో రీమేక్ కావడానికి కిందా మీదా అవుతున్న బాలీవుడ్ సినిమా. ఈ సినిమాను తనే నిర్మిస్తూ, హీరోగా నటిస్తున్నాడు నాగార్జున మేనల్లుడు సుమంత్. విఖ్యాత నటుడు తనికెళ్ల భరణి మరో కీలకపాత్ర ధారి. పల్లవీ సుభాష్ కథానాయిక. ఈ సినిమాకు నరుడా? డోనరుడా? అనే వెరైటీ టైటిల్ డిస్కషన్ లో వున్నట్లు తెలుస్తోంది. 

విక్కీ డోనార్ కు తెలుగులో సరైన పదం కానీ, టైటిల్ కానీ కుదరడం కష్టమే. కానీ ఇప్పుడు ఈ నరుడా? డోనరుడా? అన్న కాయినింగ్ మాత్రం బాగానే వున్నట్లు అనిపిస్తోంది. ఈ టైటిల్ వెనుక తనికెళ్ల సృజన వుందేమో అన్న చిన్న అనుమానం వినిపిస్తోంది. ఎందుకంటే ఆ కాయినింగ్ అలా వుంది మరి. ఈ సినిమాకు మాలిక్ రామ్ దర్శకుడు. దాదాపు సినిమా పూర్తి కావచ్చింది.

Show comments