పదివేల కోట్లు హుష్ కాకి

అసలు విషయం బయటకు రానపుడు, ఎవరి కథలు వారు అల్లేసుకోవచ్చు..ఎవడికి కావాల్సిన వాడిపై ఎవరికి వారు బురద జల్లేసుకోవచ్చు. స్వచ్ఛందంగా నల్లధనం వెల్లడి చేసే పథకానికి సంబంధించి హైదరాబాద్ సర్కిల్ లో పది వేల కోట్ల మొత్తాన్ని ఒక్కరే వెల్లడించారన్న వార్తల వైనం ఇలాగే వుందని తెలుస్తోంది. ఇంత మొత్తం కట్టింది జగన్ అనే అని తెలుగుదేశం వర్గాలు ఆరోపించడం, దానిపై కేంద్రానికి జగన్ లేఖ రాయడం తెలిసిందే.

బిజినెస్ సర్కిళ్ల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం అసలు పదివేల కోట్లు అన్నదే పక్కా క్రియేట్ చేసిన గ్యాసిప్ తప్ప వేరు కాదని తెలుస్తోంది. హైదరాబాద్ సర్కిల్ నుంచి 13 వేల కోట్ల నల్లధనం వెల్లడయిన మాట వాస్తవమే కానీ అందులో పదివేల కోట్ల ఏక మొత్తం అయితే లేదని అంటున్నారు. అంతా వెయ్యి, పది హేను వందల కోట్లు, ఇలా చిల్లర మొత్తాలే తప్ప, పదివేల కోట్ల ఏక మొత్తం లేదని తెలుస్తోంది.

పదివేల కోట్ల ఫీలర్ లాగే మరిన్ని ఫీలర్లు కూడా ముందుగా వినిపించాయట. వాటిల్లో ఓ మాజీ ముఖ్యమంత్రి మూడు వేల కోట్లు కట్టారన్న ఫీలర్ ఒకటి. కానీ పాపం నిజానికి సదరు మాజీ ముఖ్యమంత్రి దగ్గర మూడు వందల కోట్ల సీన్ కూడా లేదని వినికిడి. అలాగే ఓ న్యూస్ చానెల్ ప్రముఖుడు కూడా వంద కోట్లు వెల్లడించారని గుసగుసలు వున్నాయి. అదీ అవాస్తవమే అని, అతనికి అంత సీన్ లేదని కౌంటర్లు వినిపిస్తున్నాయి. 

హైదరాబాద్ లో ఫార్మా రంగానికి చెందిన బడా బాబులు కొందరు ఒక రేంజ్ లో నల్లధనం వెల్లడించారని ఓ టాక్ వుంది. అలాగే  చిన్న చిన్న మొత్తాల్లో ఒకరిద్దరు సినిమా జనాలు కూడా కట్టి వుంటారంటున్నారు. అంతే తప్ప, భారీగా ఏక మొత్తంలో అయితే హైదరాబాద్ సర్కిల్ లో నల్లధనం వెల్లడి జరిగి వుండదని ఘంటాపథంగా చెబుతున్నారు. ఏదైనా ఈ వ్యవహారంలో అధికారికంగా ఏదీ వెల్లడి కాదు కనుక, ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేసుకుంటున్నారంతే.

Show comments