శృంగారం.. బెడ్రూమ్ బయటే ఆమెకు థ్రిల్!

ఈ అధ్యయన ఫలితాలు వినడానికి ఒకింత విడ్డూరంగానే అనిపించక మానవు. దాదాపు మూడు వేల మంది స్త్రీల అభిప్రాయాలను తీసుకుని జరిపిన అధ్యయనమట ఇది. మ్యాగ్జిమ్ పత్రికలో ప్రచురితం అయ్యింది. ఇంతకీ విషయం ఏమిటంటే… శృంగారం ఏ ప్లేస్ లో ఎక్కువ థ్రిల్ ను ఇస్తుంది? అని! ఈ విషయంలో ఆడవాళ్ల ఫీలింగ్స్ ఏమిటో.. ఒడిసిపట్టే యత్నం చేశారట అధ్యయనకర్తలు. రొటీన్ బెడ్రూమ్ లో కాకుండా.. కొంచెం కొత్తగా ఎక్కడ? అంటే.. ఆడవాళ్ల ఎంపికలు చాలా భిన్నంగా ఉన్నాయి.

ఎలాగంటే.. బెడ్రూమ్ ఆవలకు వచ్చేస్తే, మెట్ల మీద సెక్స్ లో పాల్గొనడం తమకు ఎక్కువ థ్రిల్ ను ఇస్తుందని మెజారిటీ మహిళలు అభిప్రాయపడ్డారట! స్టెయిర్స్ మీదనా? ఏం కంఫర్ట్ నెస్ ఉంటుంది? అనే సందేహం వస్తే రావొచ్చు గాక, ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న ఆడవాళ్ల ఎంపిక మాత్రం మెట్లేనట! ఆ తర్వాత బీచ్ లో సెక్స్ యమ థ్రిల్లింగ్ అని చెప్పారట. రెండో ఎంపిక సముద్రతీరం. రిఫ్రెషింగ్, ఫన్, శాటిస్ ఫయింగ్.. అంటూ వర్ణించారట తీరంలో శృంగారాన్ని.

బయట బిగ్ ఈవెంట్ జరుగుతున్న వేళ.. పరదాల చాటును శృంగారానికి మూడో థ్రిల్లింగ్ ప్లేస్ గా చెప్పారట మహిళామణులు. నాలుగో థ్రిల్లింగ్ ప్లేస్ విమానం.. ఆ ప్రయాణంలో ఉండగా శృంగారనుభూతిని పొందడం. గ్యారేజ్, బ్యాక్ యార్డ్, ఆఫీస్ లు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
ఇవన్నీ ఫాంటసీలకు సంబంధించిన ఎంపికలు. ఆడవాళ్ల సెక్స్ ఫాంటసీల్లో  ఈ స్థానాల్లో థ్రిల్లింగ్ అని అధ్యయనకర్తలు చెబుతున్నారు. అలాగే స్త్రీలు ఏ సమయంలో ఎక్కువగా శృంగారం గురించి ఆలోచిస్తారనే అంశం గురించి కూడా ఇదే అధ్యయనంలో పేర్కొన్నారు.

ఉదయం పూట సెక్స్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని 32 శాతం మంది తెలిపారట, లంచ్ టైమ్ లో శృంగార భావనల ఆలోచనలుంటాయని ఎనిమిది శాతం చెప్పారు. మధ్యాహ్న వేళ విరామం ఉంటే శృంగారాలోచనలు అని 42 శాతం మంది తెలిపారు. ఇలాంటి వారందరూ ఉమ్మడిగా చెప్పిన మాటేమిటంటే.. సాయంత్ర వేళ మది శృంగారానుభవాన్ని కోరుకుంటుందనేది! 78.7 శాతం మంది ఆ సమయంలో సెక్స్ కోసం తపిస్తారట!

ఈ లెక్కన.. సాయంత్ర వేళ స్టెయిర్స్ మీద శృంగారం ఆమె కు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇవ్వడమే.. అని అధ్యయన కర్తలు చెబుతున్నారు!

Show comments