ఎపోచి..టీజర్ ఓకె

ఎక్కడికి పోతావు చిన్నవాడా? శంకరాభరణం సినిమా తరువాత నిఖిల్ చేస్తున్న లేటెస్ట్ మూవీ. లేటయినా లేటెస్ట్ గా అన్నట్లు, కాస్త డిఫరెంట్ టీజర్ తో వచ్చి, మళ్లీ తను, తన డిఫరెంట్ ట్రాక్ లోకి వచ్చేసానని నిఖిల్ చెప్పకనే చెప్పాడు. మామూలుగా ఇటీవలి కాలంలో హర్రర్ మూవీలు అంటే కాస్త భయం, అంతకన్నా ఎక్కువగా నవ్వులు కామన్ అయిపోయాయి. 

కానీ ఎక్కడికి పోతావు చిన్నవాడా టీజర్ చూస్తుంటే కాస్త కథ అనేది బలంగా వుంది సినిమాలో అన్న ఫీల్ కలిగించింది. సినిమాలో కథ ఏదో వుంది, అది చూడాలన్న ఆసక్తిని కలిగించడం వరకు టీజర్ ఓకె అయింది. నిఖిల్ తో నందిత శ్వేత, హెబ్బా పటేల్ తో పాటు అవికగౌర్ కూడా నటించింది. 

కానీ టీజర్ లో మాత్రం అవిక మాత్రం కనిపించలేదు. బహుశా ఆమెను తరువాత రివీల్ చేస్తారేమో? కార్తికేయలో ఏ విధంగా ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ వుందో, అలా ఈ సినిమాలో కూడా సమ్ థింగ్ వుందనే విషయాన్ని టీజర్ ద్వారా చెప్పగలిగారు. 

Readmore!
Show comments

Related Stories :