డీజే శాటిలైట్ రైట్స్... ఇదో సరికొత్త డీల్

బాలీవుడ్ స్టయిల్ లో ఇప్పుడు టాలీవుడ్ లో కూడా సినిమా సెట్స్ పై ఉంటుండగానే శాటిలైట్ రైట్స్ డీల్స్ కంప్లీట్ అవుతున్నాయి. దాదాపు స్టార్ ఎట్రాక్షన్ ఉన్న సినిమాలన్నీ సెట్స్ పైనే అమ్ముడుపోతున్నాయి. తాజాగా డీజే - దువ్వాడ జగన్నాధమ్ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడుపోయాయి. జీ తెలుగు ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. 

దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ డీల్ చాన్నాళ్ల కిందటే పూర్తయిందట. సరైనోడు లాంటి భారీ విజయం తర్వాత వస్తున్న సినిమా కాబట్టి డీజే రైట్స్ కోసం జీ తెలుగు ఛానెల్ బాగానే ఖర్చుచేసినట్టు టాక్. 

బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్ని గంపగుత్తగా కొనేయడం అనే ట్రెండ్ ఎప్పట్నుంచో ఉంది. స్టార్, సోనీ, జీ గ్రూప్ లాంటి సంస్థలు అదే పనిచేస్తున్నాయి. ఇప్పుడు తెలుగులో కూడా జీ గ్రూప్... ఆ ట్రెండ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజుకు సంబంధించిన సినిమాల రైట్స్ ను ఒకేసారి దక్కించుకునేలా డీల్ కుదుర్చుకుందట. ఇందులో భాగంగా శతమానంభవతి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న సదరు ఛానెల్.. ఆ ప్యాకేజీలో భాగంగానే డీజే రైట్స్ ను కూడా సొంతం చేసుకుందట.

Show comments