నిఖిల్ కిర్రాక్ పార్టీ

రాజ్ తరుణ్ తో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేసిన ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఇప్పుడు హీరో నిఖిల్ తో జత కడుతోంది. ఎక్కడిపోతావు చిన్నవాడా సినిమా హిట్, కేశవ సినిమా బజ్ తో మాంచి ఊపు మీద వున్న నిఖిల్, లేటెస్ట్ గా ఏకెతో సినిమా చేయడానికి ఓకె అన్నాడు. ఇద్దరు కలిసి ఇప్పుడు కిర్రాక్ పార్టీ అంటున్నారు.

అదేనండీ. కన్నడంలో పెద్ద హిట్ అయిన కిర్రాక్ పార్టీ రైట్స్ తీసుకుంది ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. ఈ సినిమాను తెలుగులో నిఖిల్ హీరోగా చేయబోతున్నారు. బహుశా ఈ సినిమాకు డ్యాన్స్ డైరక్టర్ రాజు సుందరం డైరక్టర్ గా పని చేయవచ్చు.

ప్రస్తుతం కేశవ సినిమా పూర్తి చేసి, తరువాత ప్రాజెక్టు కోసం వెయిట్ చేస్తున్నాడు నిఖిల్. వాస్తవానికి చందు మొండేటి డైరక్షన్ లో నాగ్ కాంబినేషన్ లో సినిమా చేయాలి. కానీ ముందుగా ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలు ఒకటి రెండు రోజుల్లో వెల్లడవుతాయి.

Show comments