సప్తగిరి పౌరాణిక పాత్రలు

సప్తగిరి ఫీల్డ్ లో కమెడియన్ గా తనకు అంటూ ఓ ప్లేస్ ను సంపాదించుకున్నది అతనికి వున్న సహజమైన నెల్లూరు మాండలీకం వల్ల. అయితే ఇప్పుడు తనలోని ఇంకో షేడ్ చూపించేందుకు ట్రయ్ చేస్తున్నాడట సప్తగిరి ఎక్స్ ప్రెస్ లో. ఈ సినిమాలో రెండు సీన్లలో పౌరాణిక డైలాగులు వల్లె వేస్తాడట. ఒక సీన్ లో పరుశురాముడిలా జస్ట్ తక్కువ డైలాగులే. 

కానీ మరో సీన్ లో సూపర్ పాపులర్ అయిన సుయోధనుడి..ఏమంటివి..ఏమంటివి ఆచార్యదేవా..లెంగ్తీ డైలాగులను వల్లె వేస్తాడట. సినిమాలో క్యారెక్టర్ ప్రకారం యాక్టర్ కావాలనుకుని కానిస్టేబుల్ గా మారిన పాత్ర అంట. అందుకే పార్ట్ ఇన్ పార్ట్ గా తన టాలెంట్ ను ప్రదర్శించే సీన్లు వుంటాయట. వాటి కోసమే ఈ పౌరాణిక సీన్లు వాడుకున్నారట. 

ఇంతకీ విషయం ఏమిటంటే, ఈ సీన్లలో తన నెల్లూరు యాస ఏ మాత్రం తెలియకుండా, సీరియస్ గా గ్రాంధిక డైలాగులను పెర్ ఫెక్ట్ గా చెప్పేసాడట. పైగా వాటిని బట్టీ పట్టేసి, సింగిల్ టేక్ లో ఒకె చేసేసాడట. మరి సప్తగిరి నెల్లూరు యాసను లైక్ చేసిన జనం వీటిని ఎలా తీసుకుంటారో చూడాలి.

Show comments