నాకేమంత వయసయిపోయిందని.?

ఇషా కొప్పికర్‌ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా 'చంద్రలేఖ' సినిమా గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే, ఆ సినిమాతోనే ఆమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన చిత్రమది. ఆ తర్వాత 'ప్రేమతో రా' సినిమాలో చిన్న పాత్రలో కన్పించింది ఇషా కొప్పికర్‌. అంతే, మళ్ళీ తెలుగు తెరపై కన్పించలేదీ బ్యూటీ. 

పెళ్ళయ్యింది.. ప్రస్తుతం 40 ఏళ్ళ వయసు కూడా వచ్చేసింది. అయినాసరే, గ్లామర్‌లో రాజీ పడనంటోంది ఇషా కొప్పికర్‌. 'నాకేమంత వయసయిపోయిందని.?' అంటూ అమాయకంగా ప్రశ్నిస్తోన్న ఇషా కొప్పికర్‌కి యాక్షన్‌ సినిమాలంటే ఇష్టమట. బాలీవుడ్‌లో పలు సినిమాలతో బిజీగా వున్నా, 'కేశవ' సినిమా నుంచి ఆఫర్‌ రాగానే ఓకే చెప్పాననీ, దానిక్కారణం ఈ సినిమాలో తనకు ఆఫర్‌ చేసిన పాత్ర అలాంటిదనీ ఇషా కొప్పికర్‌ చెబుతోంది. 

ఇకపై రెగ్యులర్‌గా తెలుగు సినిమాల్లో కన్పించేందుకు ప్రయత్నిస్తానంటోన్న ఇషా కొప్పికర్‌కి హైద్రాబాద్‌ అంటే అమితమైన ఇష్టమట. 'కేశవ' సినిమా ప్రమోషన్‌ కోసమొచ్చిన ఇషా కొప్పికర్‌, హీరోయిన్‌ రీతూ వర్మకంటే హాట్‌గా కన్పించేందుకు ప్రయత్నించిన విషయం విదితమే. గ్లామర్‌ అనేది వయసుకు సంబంధించిన విషయం కాదనీ, మనసుకు సంబంధించిన విషయమనీ చెప్పే ఇషా, పాత్రకు అనుగుణంగా అవసరమైతే హాట్‌ అప్పీల్‌ తెరపై పండించేందుకు తానెప్పుడూ సిద్ధమేనని క్లారిటీ ఇచ్చేసింది. 

Show comments