'బంగారం' విడుదలకి ముందే ఎ.ఎం. రత్నం బ్యానర్లో పవన్‌కళ్యాణ్ దర్శకుడిగా సత్యాగ్రహి చిత్రాన్ని అనౌన్స్ చేసారు. ఆ చిత్రానికి ఓపెనింగ్ కూడా చేసి మరీ పక్కన పడేసారు. బంగారంతో నష్టపోయిన బయ్యర్లకి వెనక సత్యాగ్రహి ఉందిలే అని భరోసా ఇవ్వడానికే ఆ ఎత్తు వేసారని అప్పట్లో అనుకున్నారు.
ఓపెనింగ్ తర్వాత మళ్లీ ఆ సినిమా ఊసే లేకపోవడంతో అది నిజమేననిపించింది. దసరాకి హడావిడిగా పూజ చేసిన పవన్, రత్నంల సినిమా కూడా అదే బాపతు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. రత్నంకి ఉన్న అప్పుల సమస్యల వల్ల తన ఖాతాలో పెద్ద సినిమాలు ఉన్నాయని జనాలు గుర్తించాలి.
అందుకే పవన్‌కి ఎప్పుడో ఇచ్చిన అడ్వాన్స్‌కి తోడు మరికొంత పైకం చెల్లించి ఈ చిత్రాన్ని అంత అర్జంటుగా అనౌన్స్ చేసారట. ఈ టైమ్‌లో కాటమరాయుడు చేయడమే ఫాన్స్‌కి మింగుడు పడని స్థితిలో ఈ సినిమా న్యూస్ ఫాన్స్‌ని కలవరపెట్టింది. కానీ రత్నం సినిమా అంటూ సెట్స్ మీదకి వెళితే అది త్రివిక్రమ్ చిత్రం తర్వాతేనని సమాచారం. అప్పటికి మంచి కథ దొరికితే ఇప్పుడు అనుకున్నది డ్రాప్ అయినా ఆశ్చర్యం లేదు.