2 గంటల 50 నిమిషాల 51 సెకెన్లు

ఎట్టకేలకు బాహుబలి-2 సినిమాకు సంబంధించి రన్ టైం ఎంతనేది తెలిసింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ప్రకారం ఈ సినిమా రన్ టైం సరిగ్గా 2 గంటల 50 నిమిషాల 51 సెకెన్లు. ఈ మేరకు సెన్సార్ సర్టిఫికేట్ బయటకు వచ్చింది. పార్ట్-2 నిడివి దాదాపు 2 గంటల 50నిమిషాలు ఉందంటూ కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. నిడివి ఎక్కువగా ఉందనే విషయాన్ని రాజమౌళి అంగీకరించినప్పటికీ, ఎగ్జాట్ డ్యూరేషన్ ఎంతనే విషయాన్ని మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఎట్టకేలకు ఈ మేటరు బయటకు వచ్చింది.

సాధారణంగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయిన వెంటనే సినిమా టాక్, సినిమా నిడివి లాంటి అంశాలు బయటకు వచ్చేస్తాయి. కానీ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే మేటర్ బయటకు రానీయకుండా ఉండేందుకు మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సినిమా డ్యూరేషన్ ఎంతనే విషయం కూడా సస్పెన్స్ గా మారిపోయింది. ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికేట్ లో బాహుబలి-2 నిడివి ఎంతనే విషయం తెలిసిపోయింది.

నిజానికి బాహుబలి-2 రన్ టైం ను గోప్యంగా ఉంచడానికి మరో కారణం కూడా ఉంది. సినిమా నిడివి ఎక్కువగా ఉంది కాబట్టి, ఆడియన్స్ బోర్ ఫీలయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ బాహుబలి-2పై నెగెటివ్ స్టోరీస్ రావడం మొదలయ్యాయి. దీంతో ఆ అంశాన్ని కావాలనే బాహుబలి టీం తెరపైకి తీసుకురాకుండా జాగ్రత్తపడింది. నిడివి ఎక్కువైనా ఆడియన్స్ కు సినిమా ఎక్కడా బోర్ కొట్టదని గతంలో రాజమౌళి ప్రకటించాడు. తర్వాత ఆ విషయాన్ని మళ్లీ ప్రస్తావించలేదు.

Show comments