దాసరి రివర్స్ లో చెప్పారేమిటో?

దర్శకుడు దాసరి ఏం మాట్లాడినా కాస్త హడావుడి తప్పదు. ప్రేమమ్ అడియో ఫంక్షన్ లో దాసరి మాట్లాడుతూ నాగ్ చైతన్య నవ్వు బాగుంటుందని, ఆ నవ్వుకే ఎవరైనా పడిపోతారని అన్నారు. అలాంటి నవ్వుతోనే ఓ హీరోయిన్ ను పడేసాడని ఇన్ డైరక్ట్ గా సమంత-చైతూల వ్యవహారాన్ని గుర్తు చేసారు. 

నిజానికి ఇప్పటి వరకు సమంతనే చైతూను పడేసిందని, అందరూ ఆమెను ' ఏమాయె చేసావే' అంటున్నారు. చైతూ లాంటి భయంకరమైన ఆస్తిపరుడు, మంచి కుర్రాడు, పైగా హీరో కాబట్టి, సమంతే పడేసిందని ఇండస్ట్రీలో ఇన్ సైడ్ కామెంట్. కానీ ఇప్పుడు దాసరి సరదాకో, సీరియస్ గానో మరి చైతూనే సమంతను పడేసాడని అన్నారు. ఈ కామెంట్ కు అక్కడే వున్న చైతూ, అఖిల్ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. 

ఇదిలా వుంటే ప్రేమమ్ పాటలు, ట్రయిలర్ చూసిన తరువాత తను అన్నతో ప్రేమ చిత్రాల్లో పోటీ పడలేనని, ఫాలో అవ్వాలనే డిసైడ్ అయిపోయానని అఖిల్ కామెంట్ చేయడం విశేషం.

Show comments