మిస్టర్‌ బ్యాడ్‌ బాయ్‌.. మారడంతే

బాలీవుడ్‌ మిస్టర్‌ బ్యాడ్‌ బాయ్‌ సంజయ్‌ దత్‌ మరోమారు చిక్కులు కొనితెచ్చుకున్నాడు. ఓ నిర్మాతని బెదిరించిన కేసులో సంజయ్‌దత్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. ఎప్పుడో 2002లో నిర్మాత షకీల్‌ నూరాని, సంజయ్‌దత్‌తో ఓ సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందుకోసం 50 లక్షలు అడ్వాన్స్‌ కూడా ఇచ్చాడు. అయితే, అడ్వాన్స్‌ తీసుకున్న సంజయ్‌దత్‌, నిర్మాత షకీల్‌ నూరానికి హ్యాండిచ్చేశాడు. బోనస్‌గా, బెదిరింపులకు కూడా దిగాడు. ఇదీ అసలు కేసు. 

ఆల్రెడీ అక్రమాయుధాలు కలిగి వున్న కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన సంజయ్‌దత్‌, ఇప్పుడీ సరికొత్త వివాదంతో సరికొత్త కష్టాల్ని కొనితెచ్చుకున్నట్లయ్యింది. కోర్టులో విచారణకు హాజరు కాకపోవడంతో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. ఈ వ్యవహారంపై సంజయ్‌దత్‌ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సంజయ్‌దత్‌కి మాత్రం ఇలాంటివన్నీ అలవాటైన వ్యవహారాలే. 

'మున్నాభాయ్‌' సిరీస్‌ సినిమాలతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నాడుగానీ, లేదంటే బాలీవుడ్‌లో సంజయ్‌దత్‌కి వున్న 'బ్యాడ్‌ బాయ్‌' ఇమేజ్‌ అంతా ఇంతా కాదు. అన్నట్టు, సత్ప్రవర్తన కారణంగా 8 నెలల జైలు శిక్ష మిగిలి వుండగానే విడుదలైన 'మున్నాభాయ్‌' సంజయ్‌దత్‌, మళ్ళీ ఇప్పుడు 'బ్యాడ్‌బాయ్‌'లా మారిపోవడమేంటట.? అంతే, మిస్టర్‌ బ్యాడ్‌ బాయ్‌ మారడంతే.!

Show comments