కాపులపై విరుచుకు పడుతున్నకమ్మ వాళ్లు..!

ముద్రగడపై మండి పడుతున్నారు.. దాసరి, చిరంజీవిలపై దుమ్మెత్తిపోస్తున్నారు. కాపుల రిజర్వేషన్ల ఉద్యమంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు! సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు వేదికగా కమ్మ సామాజికవర్గానికి చెందిన వాళ్లు ఈ పని చేస్తున్నారు.  అనునిత్యం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పోస్టులు పెట్టే వాళ్లు, బ్రింగ్ బాబు బ్యాక్ ఉద్యమంలో క్రియాశీలకంగా కనిపించిన కొంతమంది నెటిజన్లు... చంద్రబాబుపై అంతులేని అభిమానాన్ని చూపే ఈ నెటిజన్లు ఇప్పుడు కాపు రిజర్వేషన్ల పోరాటం, ముద్రగడ దీక్ష తదితర పరిణామాలపై ఫైర్ అవుతున్నారు. 

వాస్తవం చెప్పాలంటే కాపుల పోరాటంలో అర్థం ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల విషయంలో వారు పోరాడుతున్నారు. ఒకవేళ గుజరాత్ లో పటేళ్లు లాగా ఇప్పటికిప్పుడు కాపులకు రిజర్వేషన్లు కావాలి అని ఉద్యమం చేసి ఉంటే.. అందులో ఏదో కుట్ర ఉంది అని ఆనుమానింవచ్చు. స్వయంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు. తెలుగుదేశం మేనిఫెస్టోలో అధికారం ఇస్తే చాలు కాపులను బీసీల్లో చేరుస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారు. ఆ హామీని ఇచ్చిన తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లను సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది. 

ఇలాంటి నేపథ్యంలో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కాపులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీపైనే వారు ఒత్తిడి చేస్తున్నా.. ఆయన ప్రధాన మద్దతుదారులైన కమ్మ లు మాత్రం సహించడం లేదు. ప్రధానంగా కమ్మ – కాపు వైష్యమాలు ఎక్కువగా ఉండే.. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కమ్మ వాళ్ల నుంచి కాపులపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ ప్రాంతానికి చెందిన కమ్మ నెటిజన్లు ముద్రగడపై విరుచుకుపడుతున్నారు. ఆది నుంచి ముద్రగడ ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్న వీరు.. ముద్రగడ ను ఇతర కాపు నేతలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. 

ఇదంతా కుట్ర అని.. చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న ప్రయత్నం అని వీరు అంటున్నారు. కాపులకు చంద్రబాబు రిజర్వేషన్ల హామీని ఇచ్చాడనే విషయం మాత్రం అసలు గుర్తులేనట్టుగా వ్యవహరిస్తున్నారు! విశేషం ఏమిటంటే.. సార్వత్రిక ఎన్నికల సమయంలో కాపులు, కమ్మలు ఒకే మాట మీద నిలబడ్డారు! ఒకే పార్టీకి అండగా నిలిచారు. తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే 90 శాతం కమ్మవాళ్లకు తటస్థంగా ఉండే కాపుల్లో 70 శాతం మంది తోడయ్యారు. 

పవన్ కల్యాణ్ పిలుపు, రిజర్వేషన్ల మీద ఆశలతో కాపులు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. ఎన్నికలు అయ్యాకా.. దశల వారీగా కాపులను కించపరచడం మాత్రం కొనసాగుతోంది. తెలుగుదేశం విజయంలో పవన్ కల్యాణ్ పాత్ర ఏ మాత్రం లేదని తేల్చేసినా, ఇప్పుడు కాపులను అసాంఘిక శక్తులుగా అభివర్ణించినా.. తెలుగుదేశానికి అండగా నిలబడిన సామాజికవర్గానికే సాధ్యం అవుతోంది! అయిననూ ఇప్పుడు కాపులు చేయగలిగింది అయితే ఏమీ లేదు. అన్ని మాటలనూ భరించాల్సిందే! 

Show comments