దేవీ బ్రేకప్ నెల రోజుల కిందే జరిగిందా?

సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ దర్శకుడు క్రిష్ ల సినిమా బ్రేకప్ నెల రోజుల కిందటే జరిగిందట. ఇప్పుడు బయటకు వచ్చిందంతే. వీలయినంత వరకు బయటకు రానివ్వకుండా  వుంచి, వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటున్నారట. అయితే అది కాస్తా బయటకు రావడంతో ఇప్పుడు అంగీకరించక తప్పడం లేదు. 

నిజానికి దేవీ ఈ మధ్య మిగిలిన సినిమాలను కూడా కాస్త ఇబ్బంది పెడుతున్నాడని తెలుస్తోంది. ఆయన తన తండ్రి జ్ఞాపకార్థం పెట్టుకున్న స్వంత ప్రాజెక్టులు, టీవీ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేసే ప్రమోషన్ పనుల పెట్టుకోవడం వల్ల టైమ్ సరిగ్గా సెట్ కావడం లేదట. పైగా మెగాస్టార్ 150వ సినిమాను దేవీ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడట. ఆ సినిమా ట్యూన్ల కోసం మాగ్జిమమ్ టైమ్ కేటాయిస్తున్నాడట. 

ఈ క్రమంలో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కూడా దేవీ వల్ల కాస్త ఇబ్బంది పడుతోందని తెలుస్తోంది. మొత్తం మీద దేవీ మరీ బిజీ కావడం మళ్లీ థమన్ కు కలిసి వస్తుందేమో?

Show comments