అద్భుతంగా కవర్ చేసుకున్న రాజుగారు

డీజే సినిమా రిజల్ట్ ఏంటనేది చిన్న పిల్లాడ్ని అడిగినా చెబుతాడు. విడుదలైన మొదటి రోజు నుంచే మిక్స్ డ్ టాక్ తో ప్రారంభమైన అలాంటి సినిమాను బ్లాక్ బస్టర్ అని ప్రకటించేశాడు దిల్ రాజు. ఒక దశలో కలెక్షన్లకు సంబంధించి మెగాభిమానుల నుంచి కూడా వ్యతిరేకత చవిచూశాడు. ఇంత జరిగిన తర్వాత కూడా తన పంథా మార్చుకోలేదు దిల్ రాజు. తన దగ్గరున్న కుందేలుకు మూడే కాళ్లు అంటున్నాడు.

“దిల్ రాజు అనేవాడు ఇప్పటివరకు రాంగ్ స్టేట్ మెంట్ ఇవ్వలేదు. ఇవ్వడు కూడా. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ సినిమా రిజల్ట్ అయినా సోమ, మంగళవారంతో తెలిసిపోతుంది. అవన్నీ తెలుసుకున్నాకే స్టేట్ మెంట్ ఇస్తాను. డే టు డే కలెక్షన్ డీటెయిల్స్ తెలుసుకుంటాను. డిస్ట్రిబ్యూటర్స్ కోసం ఎక్కువ ఆలోచిస్తుంటాను. డీజే విషయంలో ఎక్కడో మిస్టేక్ జరిగింది”. దిల్ రాజు నయా వెర్షన్ ఇది. తను చెప్పనేయనని, డీజే విషయంలో మాత్రం ఎక్కడో మిస్టేక్ జరిగిందని అంటున్నాడు.

మరోవైపు  డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చాయనే విషయాన్ని కూడా తోసిపుచ్చాడు దిల్ రాజు. ప్రతి పంపిణీదారుడు లాభాలు కళ్లజూస్తున్నాడని, డిస్ట్రిబ్యూటర్లు 30శాతం లాస్ అయ్యారనేది వాస్తవం కాదని అంటున్నాడు.

“డీజే విషయంలో తప్పుడు సంకేతాలు వెళ్లాయి. మా బ్యానర్ లో వచ్చిన సినిమాకి సంబంధించి ఇప్పటి వరకూ మేం ఇచ్చిన స్టేట్ మెంట్ ఎప్పుడూ తప్పు కాలేదు. డీజే సక్సెస్ మీట్ లోనే సినిమా బిగ్గెస్ట్  హిట్ అని చెప్పడం జరిగింది. నిజానికి సరైనోడు సినిమా కలెక్షన్లను డీజే బీట్ చేసింది. ఇది నిజం. అందుకే సక్సెస్ మీట్ లో ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చాను. ఎక్కడో చదివాను డిస్ట్రిబ్యూటర్స్ కు 30% లాస్ అని.. అందులో నిజం లేదు.”

ఇన్ని విషయాలు చెప్పిన దిల్ రాజు.. దువ్వాడ జగన్నాథమ్ తాజా కలెక్షన్లు చెప్పమంటే మాత్రం మాట దాటేశాడు. ఫిదా సినిమా చాలా బాగుంటుంది చూడండంటూ అందరి భుజాలు తడుముకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.

Show comments