బందోబస్తు మధ్య బన్నీ ఇంటర్వూలు

టాప్ యంగ్ హీరోలు ఇంటర్వూలు అంటే ఎందుకో అంత భయపడతారు? ధైర్యంగా సమాధానాలు చెప్పడానికి వెనుకాడతారు. ఇంటర్వూకు ముందుగానే షరతులు వర్తిస్తాయి అంటూ రాజ్యాంగ నిబంధనలు ఏకరవు పెడతారు.

ఎన్టీఆర్ ఇంటర్వూ అంటే తెలుగుదేశం గురించి అడగొద్దు, బాబాయ్ గురించి నో క్వశ్చన్స్, రాజకీయాల గురించి నో డౌట్స్ అంటూ లిస్ట్ ముందు పెడతారు. బన్నీ కూడా అలాగే తయారయినట్లుంది.

ఈరోజు డిజె ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ ప్రింట్ మీడియా ఇంటర్వూలు పెట్టారు. గతంలో ‘చెప్పను బ్రదర్’ అన్న మాట వివాదానికి దారి తీసింది కాబట్టి, ఈసారి బన్నీ తన చుట్టూ మరి కొంతమందిని కూర్చోపెట్టుకున్నారట.

అంతే కాదు, ఎవరైనా సరే, జస్ట్ డిజె గురించి మాత్రమే అడగాలని ముందే కండిషన్ పెట్టేసారట. డిజె గురించి ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు ఎవరైనా? పైగా డిజె విశేషాలు మీడియాలో బయటకు రానివి ఏమున్నాయి కనుక? అందుకే ఏదో వెళ్లామా? ఇంటర్వూలు చేసామా అన్నట్లు కానిచ్సేసి బయటపడ్డారట మీడియా జనాలు.

Show comments