ఈరోస్ మళ్లీ రంగప్రవేశం?

శాతకర్ణిపై దర్శకుడు వర్మ వెల్లడించిన విషయం ఇప్పుడు టాలీవుడ్ లో డిస్కషన్ కు తావిచ్చింది. శాతకర్ణి సినిమాను ఓ కార్పొరేట్ కంపెనీ టేకోవర్ చేస్తుందన్న అనుమానాలకు తావిచ్చేలా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసాడు.

ఇలా లాస్ట్ మినిట్ లో టోటల్ రైట్స్ కు మినిమమ్ గ్యారంటీ అమౌంట్ చెప్పి, తీసుకునే వ్వవహారం యూరోస్ కే అలవాటు. మొన్నటికి మొన్న జనతా గ్యారేజ్ ను అలాగే తీసుకున్నారు. మరి ఏ అమౌంట్ మేరకు ఈరోస్ తో బేరసారాలు సాగుతున్నాయి, లేదా ఏ అమౌంట్ ను యూరోస్ ఆఫర్ చేసింది అన్నదానిపైనే జనాల ఊహాగానాలు చేస్తున్నారు.

గౌతమీ పుత్ర శాతకర్ణి హక్కులు మంచి రేట్లకే అమ్ముడుపోయాయి. సీడెడ్, ఈస్ట్, వైజాగ్ హక్కులను సాయి కొర్రపాటి, నైజాం హక్కులను సుధాకర రెడ్డి తీసుకున్నారు. మొత్తం హక్కుల మొత్తంతో ఈరోస్ కు పని వుండదు. ఓవర్ ఫ్లోస్ పైనే ఈరోస్ ఎప్పుడూ ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తుంటుంది. ఇప్పుడు ఈ సినిమాకు కూడా అలాగే చేసే ప్రయత్నంలో వుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Show comments