ఆ నిర్మాతకు నాలుగు కోట్లు హుష్ కాకి?

ఇండస్ట్రీలో లక్కీ పర్సన్ ఎవరు అంటే, టక్కున చాలా మంది దిల్ రాజు అంటుంటారు. ఈ ఏడాది ఓం నమో వెంకటేశాయ గట్టి దెబ్బ కొట్టింది. కానీ శతమానం భవతి, నేను లోకల్ ఆదుకున్నాయి. డిజె సినిమా అమ్మేసి, లాభం చేసుకున్నారని టాక్. ఆ సంగతి అలా వుంచితే ఫిదా మాంచి కలెక్షన్లు కురిపిస్తోంది. అందువల్ల బ్యాలెన్స్ షీట్ లో ప్లస్సే ఎక్కువని అందరూ అంటారు.

కానీ పాపం, గౌతమ్ నందా, దర్శకుడు సినిమాలు రెండూ మళ్లీ దిల్ రాజుకు నష్టాలే మిగిల్చేలా కనిపిస్తున్నాయి. గౌతమ్ నందాను నైజాంకు 5.5కోట్లకు దిల్ రాజు తీసుకున్నారు. మినిమమ్ గ్యారంటీ ఏమన్నా వుందో లేదో తెలియదు. లేదనే టాక్ వినిపిస్తోంది. అలా అయితే నాలుగు కోట్ల దగ్గర పోయినట్లే అని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. 

ఇక దర్శకుడు మరీ పెద్ద మొత్తానికి ఏమీ తీసుకుని వుండరు. కానీ అలా పెట్టిన చిన్న మొత్తం కూడా రికవరీ కష్టం అని అంటున్నారు. ఎందుకంటే ఓపెనింగ్స్ నే డల్ గా వున్నాయి. పైగా సినిమాకు నెగిటివ్ టాక్. అందువల్ల అక్కడా దిల్ రాజు లాస్ తప్పదని టాక్ వినిపిస్తోంది.

ఇక వచ్చేవారం జయజానకీనాయక సినిమాను దిల్ రాజే విడుదల చేస్తున్నారు. లై సినిమా విషయంలో కూడా దిల్ రాజు నైజాం మేరకు కాస్త వాటా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాలు ఏమేరకు దిల్ రాజును ఆదుకుంటాయో చూడాలి. ఏమైనా మంచె దగ్గర కూడబెడితే, కుంచం దగ్గర పోయిందని, నిర్మాణంలో సినిమాలు కాసులు తెస్తుంటే, డిస్ట్రిబ్యూషన్ లో సినిమాలు డబ్బులు ఎత్తుకుపోతున్నట్లుంది దిల్ రాజుకు.

Show comments