సప్తగిరి కాటమరాయుడు

కమెడియన్ సప్తగిరి చాలా సైలెంట్ గా తాను హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి గతంలోనే వెల్లడించాం. ఇప్పుడు ఆ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. దానికి కాస్త ఆసక్తికరమైన కాటమరాయుడు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసారు.

పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిలో చోటు చేసుకుని హిట్ కొట్టిన జానపద గీతం కాటమరాయుడా.. కదిరి నరసింహుడా నుంచి ఈ టైటిల్ ను తీసుకున్నారు.

దాదాపు తెలుగు కమెడియన్లు అందరూ ఏదో ఒక దశలో ఒకటో  రెండో సినిమాలు హీరోలుగా ట్రయి్ చేసిన వారే. రేలంగి, రాజబాబు నుంచి ధనరాజ్ వరకు కూడా. అయితే సునీల్ మాత్రమే హీరోగా ఫిక్సయిపోయాడు. మిగిలిన వారు అటు ఇటు కూడా చేస్తున్నారు. మరి సప్తగిరి ఈ సినిమా తరువాత అటు ఫిక్సవుతాడా? లేక రెండు పడవల మీద వెళ్తాడా అన్నది చూడాలి.

ప్రస్తుతం ప్రభుదేవా-తమన్నా కాంబినేషన్ లోని సినిమాలో సప్తగిరి మంచి పాత్ర చేస్తున్నాడు. Readmore!

 

Show comments

Related Stories :