హైపర్ కు హై ప్రయిస్

రామ్ - సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న హైపర్ సినిమా శాటిలైట్ సేల్ పూర్తయింది. రామ్ కెరియర్ లోనే హయ్యస్ట్ ఫిగర్ కు ఈ బేరం సెటిల్ అయింది. జీ టీవీ సంస్థ, హైపర్ యూనిట్ కలిసి ముంబాయిలో సాగించిన డిస్కషన్లు ఫైనల్ కావడంతో 6. 3 కోట్ల వద్ద ఒప్పందం కుదిరింది. 

దీంతో ఈ ప్రాజెక్టు మీద 14 రీల్స్ సంస్థకు సుమారు 10 కోట్ల లాభం వచ్చినట్లు అనుకోవాలి. థియేటర్ రైట్స్ మీదే నాలుగు కోట్ల వరకు లాభం చేసుకున్నారు. ఇప్పుడు దానికి శాటిలైట్ తోడయింది. ఒక విధంగా హైపర్ సినిమా ఇటీవలి కాలంలో 14 రీల్స్ సంస్థకు మంచి లాభాలు అందించిన ప్రాజెక్టు అనుకోవాలి. 

ఇంతకు ముందు సినిమాలు హిట్ అనిపించుకున్నా కూడా పెద్దగా లాభాలు చేసుకోలేకపోయారు. మాస్ టచ్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్లు తోడవడంతో మంచి శాటిలైట్ రేటు పలికినట్లు తెలుస్తోంది.రామ్ సరసన రాశీ ఖన్నా నటించిన  ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది.

Show comments