సందీప్ కిషన్ 'వివాహ భోజనంబు'

హీరో సందీప్ కిషన్ కూడా హోటల్ వ్యాపారంలోకి దిగిపోతున్నాడు. మొన్నటికి మొన్న నితిన్ టీ గ్రిల్ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే, సందీప్ వివాహ భోజనంబు అంటూ జూబ్లీ హిల్స్ రోడ్ నెం 10లో హోటల్ ను ప్రారంభించబోతున్నాడు. ఈ హోటల్ ప్రారంభోత్సవం ఈనెల 15 సాయంత్రం వుంటుంది. 

ప్రస్తుతం ఓ తమిళ సినిమా, అలాగే కృష్ణ వంశీ నక్షత్రం సినిమాలు సందీప్ చేతిలో వున్నాయి. అయితే ఎప్పటి నుంచో హోటల్ బిజినెస్ మీద ఆసక్తి వున్న సందీప్ కొందరు మిత్రుల సహకారంతో దాన్ని సాకారం చేసుకుంటున్నాడు. హీరో నాగార్జున దగ్గర నుంచి ఇప్పుడు సందీప్ వరకు చాలా మంది హీరోలు హోటల్ వ్యాపారంలో కాలు పెట్టిన వారే. 

వివాహభోజనంబు రెస్టారెంట్ లో అచ్చమైన తెలుగింటి వంటకాలు, భారీ రేంజ్ లో వుంటాయట. ఇంత రేంజ్ హైదరాబాద్ హోటళ్లలో ఇదేప్రధమం అంటున్నారు నిర్వాహకులు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖలు హాజరవుతారట. 

Show comments