నంది ఛాయిస్ మళ్లీ తమన్నానే?

తమ్మన్నా లక్ అనుకునేవాళ్లు టాలీవుడ్ లో కొందరు వున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ తమన్నా అయిటమ్ సాంగ్ కావాలనుకుంటారు. డైరక్టర్ సంపత్ నంది అయితే తన సినిమాలో తమన్నానే హీరోయిన్ అయితే బెటర్ అనుకుంటారు. అందుకే సంపత్ నంది ముచ్చటగా మూడోసారి తమన్నాను డైరక్ట్ చేయబోతున్నారు. 

గోపీచంద్ తో చేయబోయే సినిమాకు తమన్నానే హీరోయిన్ గా అనుకుంటున్నట్లు వినికిడి. రచ్చ, బెంగాల్ టైగర్ ల్లో తమన్నాను డైరక్టర్ సంపత్ నంది హీరోయిన్ గా తీసుకున్నారు. బెంగాల్ టైగర్ లో తమన్నా సోయగాలు జనాల మతులు పోగొట్టాయి. అందుకే అదే మ్యాజిక్ ను గోపీచంద్ సినిమాలో కూడా రిపీట్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Show comments