అవసరాల ఫుల్‌ క్లారిటీతో వున్నాడు

'బాబు బాగా బిజీ' సినిమాతో అవసరాల శ్రీనివాస్‌ అందర్నీ విస్మయానికి గురిచేశాడు. ఇంకా ఈ సినిమా విడుదల కావాల్సి వుండగా, ఆల్రెడీ సినిమాపై 'ఓ టైపు' అంచనాలు పెరిగిపోయాయి. బాలీవుడ్‌లో వచ్చిన 'హంటర్‌' సినిమాకి ఇది తెలుగు రీమేక్‌ కావడమే అందుక్కారణం. 'హంటర్‌' ఓ బోల్డ్‌ మూవీ. క్లీన్‌ కామెడీకి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన అవసరాల శ్రీనివాస్‌ అలాంటి సినిమా ఎందుకు ఒప్పుకున్నాడో ఎవరికీ అర్థం కావడంలేదు. 

'ఇలాంటి సినిమా చేయడం సబబేనా.?' అన్న ప్రశ్నకు అవసరాల శ్రీనివాస్‌ ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు. 'అష్టాచెమ్మా' సినిమా చేస్తున్నప్పుడే, 'అలాంటి సినిమా ఎందుకు ఒప్పుకున్నావ్‌.?' అని అతన్ని చాలామంది ప్రశ్నించారట. ఆ సినిమా సక్సెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముందంటున్న అవసరాల, 'హంటర్‌' సినిమా ఒప్పుకోవడం వెనుక కూడా తన ఈక్వేషన్స్‌ తనకున్నాయని చెప్పాడు. 

ఖచ్చితంగా 'హంటర్‌' రీమేక్‌ అయిన 'బాబు బాగా బిజీ' తెలుగులో మంచి విజయాన్ని అందుకుంటుందనీ, నటుడిగా తనకు మంచి పేరు తెచ్చిపెడ్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న అవసరాల శ్రీనివాస్‌, సినిమా విడుదలకు ముందున్న అనుమానాలన్నీ సినిమా విడుదలయ్యాక పటాపంచలైపోతాయని కాన్ఫిడంట్‌గా చెబుతుండడం గమనార్హం. 

కొసమెరుపు: కథ నాకు నచ్చనప్పుడు, ఇతరులకు నచ్చుతుందని గుడ్డిగా చేసేయడం వల్ల ఉపయోగముండదు. నాకు కథ నచ్చితే, అది ఇతరులకూ నచ్చవచ్చన్న నమ్మకం కుదురుతుంది.. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేస్తున్నానంటోన్న అవసరాల, ’బాబు బాగా బిజీ‘ సినిమాతో హిట్ కొడతాడా.? వేచి చూడాల్సిందే.! Readmore!

Show comments

Related Stories :