హాట్‌ బ్యూటీకి విడాకులు.. కండిషన్స్‌ అప్లయ్‌

'మేమిద్దరం ఇకపై భార్యా భర్తలుగా కలిసి వుండలేం.. విడిపోతున్నాం..' అంటూ 'బ్రేకప్‌' న్యూస్‌ చెప్పడం ఈ మధ్య ఓ 'ట్రెండింగ్‌' పాయింట్‌ అయిపోయింది. పెళ్లి చేసుకుంటున్నారు, విడిపోతున్నారు. పెళ్ళి కోసం ఎలాగైతే భారీ స్థాయిలో ఖర్చు చేసి పార్టీలు ఇస్తున్నారో, బ్రేకప్‌ పార్టీలూ అదే స్థాయిలో వుంటున్నాయి. 

ఇక, అసలు విషయానికొస్తే బాలీవుడ్‌ జంట అర్భాజ్‌ ఖాన్‌, మలైకా అరోరా ఇప్పుడు విడిపోయారు. అధికారికంగా వీరికి న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. ఏడాది క్రితమే విడాకులకు అప్లయ్‌ చేసుకుందీ జంట. అప్పటినుంచీ విడిగానే వుంటున్నారిద్దరూ. అఫ్‌కోర్స్‌, పలు కార్యక్రమాల్లో 'జంటగానే' సందడి చేస్తున్నారనుకోండి.. అది వేరే విషయం. 

అన్నట్టు, హృతిక్‌ రోషన్‌ అతని భార్య సుజనేతో విడిపోయిన విషయం విదితమే. వాళ్ళిద్దరూ తమ పిల్లల కోసం అప్పుడప్పుడూ కలుస్తున్నారు. ఈ 'కలయిక' కాస్త వెరైటీ. విదేశాల్లో బీభత్సంగా ఎంజాయ్‌ చేసెయ్యడమన్నమాట. విడిపోయినా, 'మేమిద్దరం మంచి స్నేహితులమే ఎప్పటికీ..' అంటూ సుజానే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. 

హృతిక్‌ - సుజానే వ్యవహారమలా వుంటే, మలైకా - అర్భాజ్‌ ఈ మధ్యనే ఓ కార్యక్రమంలో జంటగా చాలా చాలా రొమాంటిక్‌గా సందడి చేయడంతో అంతా వీరిద్దరూ కలిసిపోయారనుకున్నారు. కానీ, వీరికిప్పుడు విడాకులు మంజూరయ్యాయి. విడాకులు మంజూరైతేనేం, పిల్లల కోసం తామిద్దరం అప్పుడప్పుడూ కలుస్తూనే వుంటాయని ఇటు మలైకా, అటు అర్బాజ్‌ చెబుతుండడం గమనార్హం.

Show comments