చిరంజీవి అభిమాని.. అదరగొట్టేశాడు..

చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ కాలేదు. చిరంజీవి లుక్ కూడా లాక్ చేయలేదు. ఇంతలోనే ఉయ్యాలవాడ ఫస్ట్ లుక్ వచ్చేసింది. కాకపోతే అది అఫీషియల్ లుక్ కాదు. ఓ వీరాభిమాని తయారుచేసిన పోస్టర్. నిజంగా అది ఎంత బాగుందంటే.. పోస్టర్ లో టైటిల్ తెలుగులో ఉంటే కనుక ఇదే నిజమైన ఫస్ట్ లుక్ అని ఎవరైనా ఫిక్స్ అయిపోతారు.

1840 కాలానికి చెందిన కథతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా వస్తోంది. అభిమాని తయారుచేసిన ఫస్ట్ లుక్ కూడా ఆ కాలానికి చెందిన ఎలిమెంట్స్ ను ప్రతిబింబిస్తోంది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ బాగానే రౌండ్స్ కొడుతోంది.

ప్రస్తుతం చిరంజీవి 151వ సినిమాకు సంబంధించి భారీ సెట్ నిర్మించే పనిలో యూనిట్ బిజీగా ఉంది. 1847 కాలానికి చెందిన రాయలసీమ గ్రామాన్ని తలపించే విధంగా సెట్ ను నిర్మిస్తున్నారు. కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించనున్న ఈ సినిమా ఆగస్ట్ నుంచి సెట్స్ పైకి వచ్చే అవకాశముంది.

Show comments