నాగ్ ను ఏడిపించేసిన రెహమాన్

రెహమాన్ అంటేనే మ్యూజిక్ విజార్డ్. గౌతమ్ మీనన్ సినిమా అంటే పాటలు సూపర్ గా వుంటాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సాహసం శ్వాసగా సాగిపో..ఈ సినిమా అడియో గురించి హీరో నాగార్జున ఓ ముచ్చట చెప్పారు. ఆ సినిమాలో హీరోగా నటిస్తున్న నాగ చైతన్య ఓ నెల కిందట తన సినిమా సాహసం శ్వాసగా సాగిపో పాటలు తెచ్చి ఇచ్చాడట నాగ్ కు. 

వాటిని పెట్టుకుని, హెడ్ ఫోన్స్ తగిలించుకుని తన రూమ్ లో వింటూ వుండిపోయాడట నాగ్. కాస్సేపటికి అమల వచ్చి, నాగ్ కంట కన్నీళ్లు చూసి..గాబరా పడి..ఏమిటి అని అడిగిందట. తనను అంతలా కదిలించాయి ఆ సినిమా పాటలు అని చెప్పుకొచ్చాడు నాగార్జున. 

వెళ్లిపోమాకే అన్న పాట తనకు చాలా నచ్చేసిందన్నారు. మరి నాగ్ ను అంతలా కదిలించిన పాటలు, ఆడియన్స్ ను ఎలా కదిలిస్తాయో చూడాలి.

Show comments