బన్నీ సినిమాతో విలన్ గా మారిన శరత్ కుమార్

అల్లు అర్జున్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు జరిగాయి. అంతా ఊహించినట్టుగానే “నా పేరు సూర్య” అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. నా ఇల్లు ఇండియా అనేది ట్యాగ్ లైన్. దేశభక్తి కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో అర్జున్, శరత్ కుమార్ కూడా ఉన్నారు. అయితే వీళ్లలో విలన్ ఎవరనే విషయంపై మొన్నటివరకు సస్పెన్స్ ఉంది. ఈరోజు దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది.

నా పేరు సూర్య సినిమాలో శరత్ కుమార్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఓ కీలకమైన పాత్రలో సీనియర్ హీరో అర్జున్ కనిపించనున్నాడు. చాలామంది నటుల్లా శరత్ కుమార్ కూడా విలన్ పాత్రలు వేసి హీరో అయ్యారు. ఇప్పుడు బన్నీ సినిమాతో మరోసారి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయ్యారు. తెలుగులో ఆయన విలన్ వేషం వేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం.

గతంలో బన్నీకి రేసుగుర్రం లాంటి కథ అందించిన వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జులై మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. హీరోయిన్ ఎవరనేది వచ్చే నెలలోనే తెలుస్తోంది. విశాల్-శేఖర్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

Show comments