చైతూ అంత మాట అనేశాడేంటీ.!

అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం 'రారండోయ్‌ వేడుక చూద్దాం'. ఈ సినిమా కోసం తొలిసారిగా నాగచైతన్యతో జతకట్టింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తోన్న ఈ 'రారండోయ్‌ వేడుక చూద్దాం' ట్రైలర్‌ విడుదలయ్యింది. ట్రైలర్‌ నిజంగానే 'వేడుక'ని తలపించేలా వుందని చెప్పొచ్చు. ఆ గ్రాండ్‌ లుక్‌.. అబ్బో సూపర్బ్‌.. అనే స్థాయిలో వుంది. అచ్చమైన పల్లెటూరి వాతావరణం.. అదే సమయంలో రిచ్‌ లుక్‌.. వెరసి, ఓ కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అనేలా ట్రైలర్‌ని కట్‌ చేశారు. 

సినిమా నిండా కావాల్సినన్ని ఎమోషన్స్‌ వున్నాయనే విషయం అర్థమవుతోంది. మరోపక్క, హీరో నాగచైతన్య ఈ సినిమా కోసం డిఫరెంట్‌ లుక్‌ ట్రై చేశాడు. చాలా కొత్తగా కన్పిస్తున్నాడు నాగచైతన్య ట్రైలర్‌లో. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణ కానుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! 

లాస్ట్‌ పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్పా.. అని పవన్‌కళ్యాణ్‌ ఏ ముహూర్తాన అన్నాడోగానీ, అదే తరహాలో ట్రైలర్‌ చివర్లో నాగచైతన్య ఇచ్చిన పంచ్‌ కెవ్వు కేక అనాల్సిందే. 'అమ్మాయిలు మనశ్శాంతికి హానికారకం' అని పెద్ద పంచే పేల్చేశాడు నాగచైతన్య. ఆ స్థాయిలో హీరోయిన్‌, హీరోని సినిమాలో స్వీట్‌గా విసిగించేస్తుందన్నమాట.

Show comments