జగన్ కూ 'ప్యాకేజ్' ?

హోదా మీద పోరు ఆపనంటున్నారు వైకాపా అధినేత వైఎస్ జగన్.  కానీ మరో పక్క రాజకీయ వర్గాల్లో భిన్నమైన గుసగుస వినిపిస్తోంది. హోదా వ్యవహారాన్ని క్రమంగా తగ్గించేలా వైఎస్ జగన్ ను ఒప్పించే వ్యవహారాలు తెరవెనుక షురూ అయినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఓ బడా కాంట్రాక్టర్ రంగ ప్రవేశం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఇటు వైకాపా, అటు కాంగ్రెస్ లో కూడా చక్రం తిప్పగలిగి, ఇప్పుడు బాబు దగ్గర కూడా మాంచి పరపతి వున్న ఓ బడా కాంట్రాక్టర్ ఒకరు ఈ పనికి పూనుకున్నట్లు తెలుస్తోంది.  రాష్ట్రంలో చేపట్టే వివిధ భారీ ప్రాజెక్టుల్లో కొన్నింటిని జగన్ కు అనుకూలమైన కొందరు కాంట్రాక్టర్లకు అప్పగించడమో, లేదా మరేదైనా విధంగా జగన్ కు సహరించడమో వంటి కొన్ని రాజీ మార్గాలను ఆ కాంట్రాక్టర్ జగన్ ముందు వుంచినట్లు తెలుస్తోంది. 

మరి ఈ గుసగుసలు నిజమైతే, వీలయినంత త్వరలో హోదా పోరు మెల మెల్లగా తగ్గుముఖం పట్టే అవకాశం వుంది.  జగన్ ఇలాంటి వాటికి మెత్తబడతారా? లొంగుతారా? అన్న సంగతి అలా వుంచితే, మీడియేటింగ్ చేస్తున్న కాంట్రాక్టర్ కు అటు కేవిపి, ఇటు జగన్, తో కూడా మంచి సంబంధాలే వున్నాయంటున్నారు. అందువల్ల ఏదైనా సాధ్యమే రాజకీయాల్లో అనుకోవాలి. 

ఒకవేళ ఇలాంటివి నిజమైనా తెలుగుదేశం అనుకూల పత్రికల్లో ఈ వార్తలు రావు. ఎందుకంటే ఈ వ్యవహారం ఆ పార్టీకి అనుకూలమైన సంగతి కదా?

Show comments