గోపీచంద్ తో సంపత్ నంది ఫిక్స్

మొత్తానికి డైరక్టర్ సంపత్ నంది తరువాతి సినిమా ఫిక్సయిపోయినట్లే. హీరో గోపీచంద్ తో సినిమా చేసేందుకు డిసైడ్ అయ్యారు సంపత్ నంది. బెంగాల్ టైగర్ సినిమా హిట్ అయిన తరువాత హీరో రామ్ చరణ్ కు ఓ పాయింట్ చెప్పారు..అదే చోటా మేస్త్రీ..చరణ్ కు బాగా నచ్చింది. 

కానీ చరణ్ ఇప్పట్లో ఖాళీ లేరు. ధృవ చేస్తున్నారు, సుకుమార్ సినిమా చేయాల్సి వుంది, యువి వాళ్లకి మారుతితో కానీ మరొకరితో అయినా ఓ సినిమా చేయాల్సి వుంది. అందువల్ల సంపత్ నంది సినిమా పట్టాలు ఎక్కడానికి బాగా టైమ్ పట్టేలా వుంది. అందుకే ఈ లోగా ఓ సినిమా ఇంకో హీరో చేయాలని సంపత్ నంది అనుకున్నారు. స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. 

అయితే చరణ్ కు ఓ మాట చెప్పాలని ఆగారు. కాశ్మీర్ నుంచి రాగానే చరణ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన కూడా ఓకె చెప్పారని వినికిడి. ఈ మేరకు గోపీచంద్ హీరోగా ఓ సీనియర్ , భారీ చిత్రాల నిర్మాతతో ప్రాజెక్టు ఫైనల్ అయింది. ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వస్తుంది. అవును..ఇంతకీ ఈసారైనా పెద్ద మ్యూజిక్ డైరక్టర్ తో ముందుకు వెళ్తారా? లేక...? మళ్లీ భీమ్స్ యేనా?

Show comments