నాగ్ హడావుడి పెళ్లిపనులకేనా?

సాధారణంగా సినిమా విడుదలవుతున్న వీక్ లోనే ప్రచారం హడావుడి వుంటుంది. అయితే నాగార్జున-రాఘవేంద్రరావుల కాంబినేషన్ లోని ఓం నమో వేంకటేశాయ సినిమా ప్రచారానికి పది రోజులకు ముందే ప్రారంభించారు. నాగార్జున చకచకా ప్రింట్, వెబ్, విజువల్ మీడియాకు ఇంటర్వూలు ఇచ్చేసారు.

తన వంతు పబ్లిసిటీ అంతా ముగించేసారు. ఏమిటిదంతా అంటే..నాగ్ ఎక్కడికో పర్సనల్ పని మీద అవుట్ స్టేషన్ వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. అది కూడా దాదాపు వన్ వీక్ పైనే అని తెలుస్తోంది. మళ్లీ విడుదలకు ఓ రోజు ముందుగానే ఆయన హైదరాబాద్ వస్తారు. 

అయితే నాగ్ తన వ్యాపార పనుల మీద వెళ్లారని కొందరు అంటుంటే, అఖిల్ పెళ్లి వ్యవహారాల మీద వెళ్లారని మరి కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. అఖిల్ పెళ్లికి వెన్యూగా రోమ్ నగరాన్ని ఫిక్స్ చేసారు. యాభై నుంచి అరవై మంది మాత్రం ఈ పెళ్లికి వెళ్తారని వినికిడి. ఆ ఏర్పాట్ల కోసమే నాగ్ ఇప్పుడు ఫుల్ వీక్ ట్రిప్ వేసారని వినికిడి.

Show comments