వెంకీ.. ఏంటా కమిట్‌మెంట్‌.?

కమిట్‌మెంట్‌ విషయంలో ఏమాత్రం తగ్గడంలేదు మన హీరోలు. బాలీవుడ్‌ హీరోలేనా.? మేమూ చెయ్యగలం.. అని నిరూపించేస్తున్నారు. వయసు వీళ్ళ ముందు చిన్నబోతోంది. ఐదు పదుల వయసు దాటేసినా, ఫిజిక్‌ని మెయిన్‌టెయిన్‌ చెయ్యడంలో అయినా, ఆ ఫిజిక్‌ని స్ట్రాంగ్‌గా మలచుకోవడంలో అయినా, రిస్కీ షాట్స్‌ చేయడంలో అయినా.. వారెవ్వా అనిపించేస్తున్నారు. 

సీనియర్‌ హీరోల్లో చిరంజీవి చాన్నాళ్ళ తర్వాత హీరోగా తెరంగేట్రం చేస్తున్న విషయం విదితమే. డాన్సుల్లోనూ, ఫైట్స్‌లోనూ అలనాటి జోష్‌ ఏమాత్రం తగ్గకూడదని చిరంజీవి చాలానే కష్టపడ్తోన్న విషయం విదితమే. ఇక, బాలకృష్ణ విషయానికొస్తే, తెరపై డాన్సులు చేయడంలో ఏమాత్రం తగ్గడంలదు.. అంతేనా, మునుపటితో పోల్చితే ఇంకా జోష్‌తో డాన్సులేసేస్తున్నారు. 'మన్మథుడు' నాగార్జున, ఈ వయసులోనూ మునుపటి హ్యాండ్సమ్‌ లుక్‌ని అలాగే మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారు. 

ఇక, వెంకీని వెరీ వెరీ స్పెషల్‌గా చెప్పుకోవాలి. 'దృశ్యం', 'గోపాల గోపాల' సినిమాలో మధ్యతరతి వ్యక్తిగా, మధ్యవయసు వ్యక్తిగా కన్పించిన వెంకటేష్‌, 'బాబు బంగారం' సినిమాకొచ్చేసరికి హ్యాండ్సమ్‌ లుక్‌లోకి మారిపోయారు. మళ్ళీ ఇప్పుడు తన వయసుకు తగ్గ పాత్రలో కనిపించబోతున్నారు వెంకటేష్‌. అదీ 'గురు' సినిమా కోసం. వయసు ఎలా వున్నా, బాడీ ఫిట్‌నెస్‌ మాత్రం వారెవ్వా.. అన్పించబోతోంది. ఇదిగో, సాక్ష్యం.. ఇక్కడే పై ఫొటోలో కన్పిస్తోంది కదా.! 

'ఆరోగ్యం సహకరించదేమో..' అని సన్నిహితులు సూచించినా, ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ని పెట్టుకుని, చాలా జాగ్రత్తలు తీసుకుని, ఫిజిక్‌ని పెర్‌ఫెక్ట్‌గా వెంకీ మౌల్డ్‌ చేసుకున్నారట. ఫస్ట్‌ లుక్‌తోనే అదంతా స్పష్టంగా కన్పిస్తోంది. సినిమాలో వెంకటేష్‌ని చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందేనట. వారెవ్వా వెంకీ.. వాట్‌ ఎ కమిట్‌మెంట్‌.. అనకుండా వుండలేం.

Show comments