సునీల్ సరసన ఢిల్లీ మోడల్

నిర్మాత పరుచూరి ప్రసాద్ దర్శకుడు క్రాంతి మాధవ్ డైరక్షన్ లో రూపోందుతున్న సినిమ షూట్ లో బిజీగా వున్నాడు హీరో సునీల్. ఓ కేరళ ముద్దు గుమ్మ ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా షూట్ పొలాచ్చిలో చకచకా సాగుతోంది. ఇదిలా వుంటే నిర్మాత, దర్శకుడు ఎన్ శంకర్ కూడా సునీల్ తో సినిమాకు ఏర్పాట్లు షురూ చేసారు.

ఈ సినిమా పాటల ట్యూన్ లు ఇటీవల కంపోజ్ చేసారు. సంగీత దర్శకుడు గోపీ సుందర్-దర్శకుడు శంకర్ కలిసి ఇటీవల కేరళలో వారం రోజుల సిటింగ్ వేసి ట్యూన్ లు ఫైనల్ చేసారు. ఇప్పుడు పాటల రికార్డింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో సునీల్ సరసన నటించేందుకు ఓ ఢిల్లీ మోడల్ ను ఎంపికచేసారు.

ఆమెకు త్వరలో ఫొటో షూట్ చేస్తారు. అది పాసై పోతే హీరోయిన్ గా  ఫిక్సయిపోతుంది. ఈ సినిమా షూట్ చాలా వరకు విదేశాల్లో వుంటుంది. అందుకోసం లోకేషన్లు ఫిక్స్ చేసేందుకు దర్శకుడు శంకర్ విదేశాలకు బయల్దేరుతున్నారు.

Show comments