సాయి ధరమ్ విన్నర్

తిక్క సినిమా ఫలితం తరువాత హీరో సాయి ధరమ్ తేజ చేస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసినట్లు బోగట్టా. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు విన్నర్ అన్న పేరు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విన్నర్ అన్న టైటిల్ ను నిర్మాత ఠాగోర్ మధు రిజిస్టర్ చేయించారు. 

ఇదే సంస్థ శ్రీను వైట్ల-వరుణ్ తేజ కాంబినేషన్ లోని సినిమాకు మిస్టర్ అన్న టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా వుంటే సాయిధరమ్ తేజ సినిమా షూట్ చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. ప్రస్తుతం సిటీ లిమిట్స్ లోనే షూటింగ్ జరుగుతోంది. మిస్టర్ సినిమా మాత్రం స్పెయిన్ షెడ్యూలు పూర్తి చేసుకుని వచ్చింది. త్వరలో చిక్ మంగుళూరుకు యూనిట్ బయల్దేరి  వెళ్తుంది.

Readmore!
Show comments

Related Stories :