మారుతి కథలు అక్కడా హిట్ లే

డైరక్టర్ మారుతి కూడా హీరోల మాదిరిగా పక్క భాషల్లో డిమాండ్ పెంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆయన సినిమాల తమిళ, కన్నడ వెర్షన్లు కూడా సూపర్ హిట్ లు అయ్యాయి. దీంతో ఇక మీదట మారుతి సినిమాలకు రీమేక్ రైట్స్ బాగానే పలికే అవకాశం వుంది. 

మారుతి డైరక్ట్ చేసిన ప్రేమకథాచిత్రమ్ ను తమిళంలో తీసారు. సూపర్ హిట్ అయింది. లేటెస్ట్ గా భలేభలేమగాడివోయ్ సినిమాను కన్నడంలో తీసారు. అక్కడా మంచి మార్కులు కొట్టేసి, బాక్సాఫీసు దగ్గర వసూళ్లు బాగానే లాగిస్తోంది. మరి ఇంతకన్నా ఏం కావాలి? రీమేక్ రైట్స్ లో కొంత అయినా పర్సంటేజ్ దర్శకుడికి వుంటుంది. 

అది పద్దతి. అందువల్ల ఆ విధంగా కూడా మారుతికి బాగుంటుంది. అయితే ఇకపై అక్కడి జనాల అభిరుచి కూడా దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకుంటాడేమో. ప్రస్తుతం మారుతి యువి సంస్థ కోసం శర్వానంద్ తో మహానుభావుడు అంటూ ఓ సినిమా తయారుచేసే పనిలో వున్నారు.

Show comments