"బం చిక్ బం" అంటున్న అమలాపాల్

పోయిన క్రేజ్ ను తిరిగి తెచ్చుకోవాలంటే ఏదో ఒక రూపంలో వార్తల్లో నలగాల్సిందే. నలుగురి దృష్టిలో పడాలంటే సోషల్ మీడియాలో సందడి చేయాల్సిందే. అమలాపాల్ కు ఈ విషయం బాగా తెలుసు. అందుకే టైం దొరికినప్పుడల్లా తనకు సంబంధించిన ఏదో ఒక ఫొటోతో ఈ అమ్మడు హంగామా చేస్తూనే ఉంటుంది. తాజాగా యోగా స్టిల్స్ ను పోస్ట్ చేసింది ఈ బ్యూటీ.

అందంగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా అవసరం. అందుకే పొద్దున్నే లేవండి నాలా యోగా చేయండంటూ ఓ ఉచిత సలహా కూడా పడేసింది. ఆమె ఆసనాల మాట అటుంచితే, టైట్ డ్రెస్ తో యోగా చేస్తూ ఆమె దిగిన ఫొటోలు, అందులో భంగిమల్ని మాత్రం జనాలు లొట్టలేసుకుంటూ చూస్తున్నారు. 

ఆ మధ్య విడాకులు, తాజాగా సుచి లీక్స్ వ్యవహారాలతో అమలా పాల్ చాలా ఇబ్బందిపడింది. వాటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఈ అందగత్తె.. ప్రస్తుతం 3 తమిళ సినిమాలు, ఓ అరడజను ఫొటోషూట్స్ తో బిజీగానే ఉంటోంది. వీటితో పాటు తెలుగులో రీఎంట్రీ కోసం తహతహలాడుతోంది.

Show comments