పోర్న్‌... ఒకరే చూస్తే ఒక లెక్క, ఇద్దరూ కలిసి చూస్తే ఇంకో లెక్క!

నైతికంగా చెప్పాలంటే.. పోర్న్‌ చూడటం అనైతికం. కట్టుబాట్లు, విలువల ప్రకారం చూసుకున్నా.. సామాజికంగా చూసుకున్నా పోర్న్‌ చూడటం అనైతికం. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఉమెన్‌ ట్రాఫికింగ్‌, చైల్డ్‌ ట్రాఫికింగ్‌కు.. పోర్న్‌ ఇండస్ట్రీకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒకరకంగా చూస్తే.. పోర్న్‌ను చూడటం అంటే నిస్సందేహంగా స్త్రీలపై, పిల్లలపై జరుగుతున్న కిడ్నాపింగ్‌లను, వారిపై జరుగుతున్న లైంగికదాడులను, వారిని ప్రలోభ పెట్టి సెక్స్‌ మార్కెట్‌లోకి తీసుకొస్తున్న వారిని ఎంకరేజ్‌ చేయడమే. పోర్న్‌ చూసే ప్రతి ఒక్కరికీ అలాంటి వీటితో పరోక్షంగానైనా సంబంధం ఉన్నట్టే. ఒక్కరు పోర్న్‌ చూడకపోయినా.. ఎక్కడో ఒక చోట.. మహిళలపై ఏదో విధంగా జరుగుతున్న అఘాయిత్యాన్ని ఆపుతున్నట్టే. 

అదంతా నైతికతకు, బాధ్యతకు సంబంధించిన అంశం. ఆ సంగతలా ఉంటే.. అంతకు మించి పోర్న్‌ కూడా ఇక ఇండస్ట్రీ. సంప్రదాయ ముసుగు వేసుకున్న భారత్‌లో కూడా అది భారీ ఎత్తున వర్ధిల్లుతోంది. ఇక్కడ నీలిచిత్రాలు నిషేధమే. అయితే ఇండియాలో దేనిపై నిషేధం ఉంటుందో.. అదే సులభంగా దొరుకుతుంది. చొచ్చుకుపోతుంది. పోర్న్‌ కూడా అదే కేటగిరికి చెందినది. ఈ సంగతంతా ఇలా ఉంటే.. పోర్న్‌ చూడటానికి, సెక్సువల్‌ లైఫ్‌కు చాలా దగ్గరి సంబంధమే ఉందని అంటున్నారు మానసిక, శారీరక శాస్త్ర పరిశోధకులు.

పోర్న్‌కు వ్యక్తుల శృంగార జీవితానికి గల ముడి గురించి ఇండియానా యూనివర్సిటీ వాళ్లు జరిపిన అధ్యయనంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పేర్కొన్నారు. వీరు చెబుతున్న దాని ప్రకారం పోర్న్‌ను ఒంటరిగా చూడటానికి , జంటగా కలిసి కూర్చుని చూడటానికి చాలా వ్యత్యాసం ఉంది. అసలు వ్యత్యాసమంతా ఇదే. స్త్రీ అయినా పురుషుడు అయినా.. ఒంటరిగా పోర్న్‌ చూసే అలవాటు ఉందంటే.. వారు తమ లైంగిక జీవితం పట్ల అసంతృప్తితో ఉన్నట్టే అని పరిశోధకులు అంటున్నారు. ప్రత్యేకించి వివాహమైన లేదా డేటింగ్‌లో సహజీవనంలో ఉన్న వారి చూపు సోలో కూర్చుని చూసే పోర్న్‌ వైపు మళ్లిందంటే.. అది వారి బ్యాడ్‌ సెక్సువల్‌ లైఫ్‌కు సంకేతం అని అధ్యయనకర్తలు పేర్కొన్నారు.

అయితే సెక్సువల్‌ యాక్టివిటీస్‌ వైపు నుంచి చూస్తే.. పోర్న్‌ను చూడటం పూర్తిగా బ్యాడ్‌ హ్యాబిట్‌ కాదు అని వీరు పేర్కొన్నారు. పార్ట్‌నర్‌తో కలిసి కూర్చుని పోర్న్‌ను చూసే వాళ్లు నిజంగా చాలా లక్కీ అని అధ్యయనకర్తలు వివరించారు. వారిద్దరూ నిజాయితీగా ఉన్నట్టని, వారు తమ శృంగార జీవితాన్ని ఆనందకరం చేసుకుంటున్నట్టే అని ఇండియానా పరిశోధకులు పేర్కొన్నారు. వీరు చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పోర్న్‌ను చూసి ఇన్‌ ఫిరియారిటీ లోనయ్యేది మగవాళ్లేనట. ఎలాగూ పోర్న్‌లో చూపేది అబద్ధపు శృంగారమే, అది కల్పితమే.. అయినప్పటికీ తాము అలా చేయలేకపోతున్నామని మగవాళ్లే చిన్నబుచ్చుకుంటారట. దాదాపు యాభైవేల మంది శాంపిల్స్‌ను తీసుకుని ఈ అధ్యయనం చేసినట్టుగా ఇండియానా వర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు.

Show comments