శృంగారం అంటే.. అది పిల్లల కోసం అని భావించే ఆలోచనతో మొదలుపెడితే, మొత్తం 237 రకాల విభిన్నమైన ప్రేరేపణలు స్త్రీని బెడ్ మీదకు రప్పిస్తాయని అంటున్నారు పరిశోధకులు. యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా అధ్యయనకర్తలు ఈ అంశం గురించి పరిశోధించారు. స్త్రీలో శృంగార కోరికను రేకెత్తించే రీజన్ల గురించి వీరి అధ్యయనం సాగింది. ఎలాంటి భావన మదిని తాకినప్పుడు మీలో శృంగారం కావాలనే కోరిక తలెత్తింది అనే ప్రశ్న ద్వారా వీరు మగువల మనసును తెలుసుకునే యత్నం చేశారు.
దీనికి విభిన్నమైన, విచిత్రమైన సమాధానాలు వచ్చాయని.. దాదాపు 237 రకాల ఆన్సర్లు వచ్చాయని వారు వివరించారు. ఆయా రకాల భావోద్వేగాలు మనసును తాకినప్పుడు శరీరం శృంగార స్పర్శను కోరుతుందని వీరు చెప్పారు. 237 రకాల భావాల్లో టాప్ టెన్ ఫీలింగ్స్ ఏమిటో వీరు చెప్పారు. ఇవి చాలా ఎక్కువ ప్రభావవంతమైనవని వివరించారు.
-శారీరక ఆకర్షణ.. ఆపోజిట్ జెండర్ ఆకర్షించినప్పుడు తమలో శృంగార భావనలు కలిగాయని ఎక్కువశాతం మగువలు పేర్కొన్నారట. శృంగారానికి కీ శారీరక ఆకర్షణలోనే ఉందని వీరు అంచనా వేస్తున్నారు.
-లైంగిక తృప్తి.. దీన్ని రెండో రీజన్ గా పేర్కొన్నారు. శృంగారంలో కలిగే మధురానుభూతి రతికి ప్రేరేపిస్తుందని చెప్పారట.
- సెక్స్ బాగుంటుంది, ఆనందాన్ని ఇస్తుంది. అందుకే అనేది మూడో రీజన్ అట.
-అతడిపై ప్రేమ.. పార్టనర్ పై ప్రేమను శృంగారం ద్వారా వ్యక్తీకరించడం శృంగారానికి హేతువుల్లో నాలుగోది. ప్రేమను ప్రదర్శించడానికి కూడా శృంగారం ఒక గొప్ప మార్గమని మగువలు నమ్ముతున్నారట. ఇది ఐదో రీజన్.
-సెక్స్ ను ఫన్ గా భావించడం, ప్రేమలో ఉన్నామనే భావనతో దగ్గరవ్వడం వంటి కారణాలు కూడా స్త్రీలో శృంగార భావనలను కలిగించడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయని అధ్యయనకర్తలు పేర్కొన్నారు.
శారీరక కోరికలు, ఆకర్షణలు తాత్కాలిక బంధాల్లో కలయికకు కారణం అయితే, ధీర్ఘకాలిక బంధాల్లో మానసికమైన, భావోద్వేగాలు శృంగార భావనలను కలిగిస్తాయని పరిశోధకులు విశ్లేషించారు.