సోషల్ మీడియాలో తమన్నా యాక్టివ్‌గానే వుంటుంది. కానీ, 'బాహుబలి ది కంక్లూజన్' విడుదలయ్యాక సైలెంటయిపోయింది. దాదాపుగా మీడియాకి ఆమె చిక్కలేదు కూడా. మామూలుగా అయితే 'బాహుబలి ది కంక్లూజన్' సాధించిన విజయం నేపథ్యంలో తమన్నా మీడియా ముందుకు బాగానే వచ్చి వుండాలి. ఎందుకంటే, 'బాహుబలి ది బిగినింగ్'లో ఆమె పాత్ర అలాంటిది. అయితే, 'బాహుబలి ది కంక్లూజన్'కి వచ్చేసరికి తమన్నా పాత్రకి ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది.
'బిగినింగ్'లో వున్నంత సీన్, 'కంక్లూజన్'లో వుండదని తమన్నాకి ముందే తెలుసు. అయినాసరే, కొంతమేర ఆమె మీద చిత్రీకరించిన సన్నివేశాలకు కత్తెర పడ్డంతో 'అవంతిక' హర్ట్ అయ్యిందనే గుసగుసలు విన్పించాయి. 'అబ్బే, అదంతా ఉత్తదే..' అంటూ తమన్నా మొహమాటంగా కవరింగ్ ఇచ్చిందిగానీ, ఇన్ని రోజులుగా 'బాహుబలి ది కంక్లూజన్' సక్సెస్‌పై అమితానందాన్ని వ్యక్తం చేయకుండా తమన్నా ఎందుకు మొహమాటంగా వ్యవహరించిందట.?
సరే, తమన్నా రీజన్స్ తమన్నాకి వుంటే వుండొచ్చుగాక. కానీ, 'బాహుబలి ది కంక్లూజన్' ఇప్పుడు ఇండియాలోనే ది బిగ్గెస్ట్ హిట్ సినిమాగా మారింది. వెయ్యి కోట్ల వసూళ్ళు సాధించి, ఇంకా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూనే వుంది. సినిమా పేరుతో ఏదో ఒకరకంగా మీడియా ముందుకొచ్చి వుంటే, తద్వారా సినిమాకి కాదు, తమన్నాకే అదనపు పబ్లిసిటీ వచ్చి వుండేది. ఈ లాజిక్ తమన్నా ఎలా మిస్సయ్యిందో ఏమో.!