సాహో..బాలీవుడ్ మీడియా

తెలుగువాడికి గర్వకారణం, తెలుగువాడి సినిమా. తెలుగువాడి ప్రతిభ. ఇలా చాలా పదాలు, ఉపమానాలు వాడతారు బాహుబలి గురించి. కానీ బాహుబలి యూనిట్ కు మాత్రం తెలుగు మీడియా పట్టనే పట్టదు. చానెళ్ల జనాలను పిలిచి అరేంజ్డ్ ఇంటర్వూలు ఇచ్చేసారు. మిగిలిన జనాలందరికీ పేరంటం మాదిరిగా పబ్లిక్ మీటింగ్ టైపులో పని కానిచ్చేసారు. అక్కడితో ప్రభాస్ పని అయిపోయింది.

సినిమా ఇంక రెండు రోజుల్లో విడుదల వుందనగా, యూనిట్ కు తెలుగు మీడియా మళ్లీ గుర్తుకు వచ్చింది. అప్పటికే తమిళ, మలయాళ, హిందీ తో పాటు విదేశీ ప్రమోషన్లు కూడా ముగిసాయి. తెలుగు మొక్కుబడి మాత్రం మిగిలిపోయింది. దీంతో అప్పటి కప్పుడు మిట్టమధ్యాహ్నం మంటుటెండ వేళ దర్శకుడు రాజమౌళి మీడియా పేరంటం పెట్టారు. వెళ్లిన వాళ్లు వెళ్లారు. లేని వాళ్లు లేదు. కానీ చిత్రంగా మళ్లీ ప్రింట్ మీడియా మాత్రమే కవరేజీ ఇచ్చింది. వెబ్ మీడియా పెద్దగా పట్టించుకోలేదు. 

సినిమా విడుదల గంటల్లో వున్నా ఇంతవరకు ప్రివ్యూ వుందా లేదా అన్నది కూడా యూనిట్ చెప్పలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం ప్రివ్యూకి భారీ ఇన్విటేషన్. ఇదే విధంగా తమిళనాట కూడా ముందురోజే ప్రివ్యూకి ఏర్పాట్లు. కానీ ఏ తెలుగువారికి గర్వకారణం అని నిర్మాత రాఘవేంద్రరావుతో సన్నిహిత సంబంధాలు వున్న మీడియా ఊదరగొడుతూందో, ఆ తెలుగు మీడియాకు మాత్రం ఇంతవరకు ప్రివ్యూ సమాచారమూ లేదు. తెలుగు మీడియా మాత్రం, రాజుగారి దేవతా వస్త్రాలను చూసినట్ల బాహుబలి ని చూస్తూంది.

బాలీవుడ్ మీడియా స్టామినా అది. తెలుగు మీడియా అంటే బాహుబలికి వున్న చిన్న చూపుఇది. Readmore!

Show comments