సాయి
బాహుబలి 2 సినిమా రెండువారాల తరువాత సి సెంటర్లలో డ్రాప్ అయింది. బి సెంటర్లలో ఓ మాదిరిగా, ఏ సెంటర్లలో సూపర్ గా ఆడేస్తోంది. దీనికి కారణం మరేమీ కాదు, చిన్న ఊళ్లలో చూసే జనాలు అంతా చూసేసారు, అందుకే డ్రాప్ అయింది అనుకున్నారు. అదే సమయంలో థియేటర్లు కాస్త ఖాళీ కావడంతో కొత్త సినిమాలు క్యూ కట్టడం ప్రారంభించాయి.
ఇదే సమయంలో బి, సి సెంటర్ల బాహుబలి థియేటర్లు రేట్లు మామూలు చేసేసాయి. రెండు వందలు, ఆ పైన అమ్మిన థియేటర్లు అన్నీ నార్మల్ రేట్లకు వచ్చేసాయి. అప్పుడు మొదలైంది మళ్లీ బి సి సెంటర్లలో బాహుబలి జాతర. ఇప్పడు చిత్రంగా ఈ శని, ఆదివారాలల్లో ఈ సెంటర్ ఆ సెంటర్ అని లేకుండా బాహుబలి 2 కుమ్మేస్తోంది. ఇది చూస్తుంటే, కొత్త సినిమాలకు దడ పుడుతోంది.
ఎండలు భయంకరంగా వుండడంతో దక్షిణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో యాభై రూపాయిలు ఇచ్చి బాహుబలి థియేటర్ లో కూర్చోవడం బెటర్ అన్న టాక్ వినిపిస్తోంది. పైగా విడుదలవుతున్న సినిమాలు కూడా ఏవీ పెద్దగా అద్భుతంగా లేకపోవడం కూడా బాహుబలి 2 కు కలిసివస్తోంది. ఇప్పటికి లాభాల బాట పట్టిన బాహుబలి 2 బయ్యర్లు, ఇక వాటిని లెక్క పెట్టుకోవడం ప్రారంభిస్తారు.