హిందీ 'బాహుబలి-2' వాట్‌ ఏ రికార్డ్‌

7 రోజులు - దంగల్‌ - 197.54 కోట్లు 

9 రోజులు - సుల్తాన్‌ 229.16 కోట్లు (సినిమా బుధవారం విడుదల కావడంతో ఫస్ట్‌ వీక్‌ అంటే 9 రోజులయ్యింది) 

7 రోజులు - బాహుబలి ది కంక్లూజన్‌ - 247 కోట్లు 

ఇది హిందీ వెర్షన్‌కి సంబంధించిన రికార్డ్‌. తొలి స్థానంలో కనీ వినీ ఎరుగని వసూళ్ళతో 'బాహుబలి ది కంక్లూజన్‌' తొలి వారం రికార్డుల్ని కొల్లగొట్టిన వైనం. 247 కోట్లు అంటే ఆషామాషీ విషయం కాదు. అసలు, బాలీవుడ్‌ సినిమాలతో తెలుగు సినిమా పోటీ అన్న విషయమే ఎవరూ ఊహించుకోలేదిప్పటిదాకా. అలాంటిది, బాలీవుడ్‌లో టాప్‌ వసూళ్ళ చిత్రాల్ని భారీ మార్జిన్‌తో 'బాహుబలి ది కంక్లూజన్‌' వెనక్కి నెట్టేయడమంటే ఇదొక అద్భుతం. 

తొలి వారం, మొత్తం అన్ని భాషలతో కలిసి తొలి వారం వసూళ్ళను 534 కోట్లుగా తేల్చారు బాలీవుడ్ ట్రేడ్ పండితుడు తరణ్ ఆదర్ష్. ఇది ఇండియాకి సంబంధించిన వసూళ్ళ లెక్క మాత్రమే. ఓవరాల్ వసూళ్ళలో ఇప్పటిదాకా ఫస్ట్‌ ప్లేస్‌లో వున్న 'దంగల్‌'ని 'బాహుబలి' ఆల్రెడీ వెనక్కి నెట్టేసింది. హిందీ వెర్షన్‌ 'బాహుబలి ది కంక్లూజన్‌' రోజువారీ లెక్కలు చూసుకుంటే, శుక్రవారం 41 కోట్లు, శనివారం 40.50 కోట్లు, ఆదివారం 46.50 కోట్లు, సోమవారం 40.25 కోట్లు, మంగళవారం 30 కోట్లు, బుధవారం 26 కోట్లు, గురువారం 22.75 కోట్లు వసూలు చేయడం గమనార్హం. మొత్తం కలిపి 247 కోట్లు - ఏడు రోజులకన్నమాట. 

బాలీవుడ్‌ ట్రేడ్‌ పండితుల్ని విస్మయపరుస్తున్న ఈ లెక్కలు, మన తెలుగు సినిమా సత్తాని చాటి చెప్పాయి. సినిమాని అద్భుతంగా తెరకెక్కించడమొక్కటే కాదు, మార్కెటింగ్‌ స్ట్రాటజీని పక్కాగా అమలు చేయడం 'బాహుబలి ది కంక్లూజన్‌' ఈ స్థాయి విజయాన్ని సాధించడానికి గల ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సాహోరే బాహుబలీ.!

Show comments