పార్ట్-3 లేదు.. టీవీ సిరీస్ మాత్రమే..

ఆమధ్య రాజమౌళి చేసిన ప్రకటనతో బాహుబలి ఫ్రాంచైజీకి పార్ట్-3 ఉంటుందని అంతా ఊహించారు. కానీ ఆ సినిమా కథా రచయిత విజయేంద్రప్రసాద్ మాత్రం ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. బాహుబలి సినిమాకు పార్ట్-3 ఉండదని తేల్చిచెప్పేశారు. మరోవైపు నిర్మాతలు కూడా త్వరలోనే బాహుబలి టీవీ సిరీస్ ప్రారంభించబోతున్నారు. అంటే బాహుబలి-3 ఉండదని అర్థం.

బాహుబలి-2  మేనియా ముగిసిన వెంటనే టీవీ/వెబ్ సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు రామోజీ ఫిలింసిటీతో ఒప్పందం కూడా పూర్తయింది. ఫిలింసిటీలో వేసిన మాహిష్మతి సెట్ లోనే టీవీ సిరీస్ కూడా ప్రారంభం అవుతుంది. ఎన్ని ఎపిసోడ్స్ చేయాలి, ఎంత బడ్జెట్ పెట్టాలి, నటీనటులు ఎవరు అనే అంశాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇవన్నీ ఇంకా ఆలోచన దశలో ఉన్నాయి కానీ ఒక్క విషయం మాత్రం ఫైనల్ చేశారు. అదేంటంటే.. బాహుబలి టీవీ/వెబ్ సిరీస్ ను మొదట హిందీలోనే తీయాలని అనుకుంటున్నారు.

బాహుబలి ఫ్రాంచైజీకి జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. సో.. టీవీ సిరీస్ కు కూడా డబ్బులు రావాలంటే దాన్ని హిందీ వెర్షన్ లోనే తెరకెక్కించాలి. పైగా ఈ మొత్తం వ్యవహారాన్ని బాలీవుడ్ కనెక్ట్ ఉన్న ఓ దర్శకుడికి అప్పగించాలని కూడా అనుకుంటున్నారు. సో.. బాహుబలి టీవీ సిరీస్ వచ్చేది హిందీలోనే. తర్వాత అది యాజ్ ఇటీజ్ గా తెలుగులోకి డబ్ అవుతుందన్నమాట.

Show comments