త్రిషకి కూతురుంది తెలుసా.?

త్రిష జంతు ప్రేమికురాలు. పైగా, స్ట్రీట్‌ డాగ్స్‌ అంటే త్రిషకి ఎనలేని అభిమానం. వీధి కుక్కల్ని చేరదీయడంలో చాలా ఆనందం వుందంటుంది త్రిష. మాటలు చెప్పడమే కాదు, వీధి కుక్కల్ని పెంచుకోవడం త్రిషకి హాబీగా మారిపోయింది. ఎక్కడన్నా దయనీయ స్థితిలో వీధి కుక్కలు కన్పిస్తే, వాటిని ఆదుకోవడం, తగిన ఆహారం దానికి అందివ్వడం, వాటిని సంరక్షణ నిమిత్తం వేరే చోటకి తరలించడం, లేదంటే తన వద్దనే పెంచుకోవడం త్రిషకి అలవాటే. 

ఇక, అసలు విషయానికొస్తే, త్రిషకి ఆ మధ్యన ఓ కొడుకు వుండేవాడు. వాడి పేరు క్యాడ్‌బరీ. కొడుకంటే కొడుకు కాదు, త్రిష పెంచుకునే కుక్క ముద్దు పేరు. కొడుకు అన్నాం కదా, అంటే దానర్థం మేల్‌ డాగ్‌ అని. ఇప్పుడు త్రిష దగ్గరకి ఇంకో ఫిమేల్‌ డాగీ వచ్చి చేరింది. కొడుకు పోయి, కూతురొచ్చె.. అంటూ త్రిష అమితానందాన్ని ప్రదర్శిస్తోంది. 'మై డాటర్‌..' అంటూ త్రిష దాన్ని ముద్దుగా పిలుచుకుంటోంది. 

అన్నట్టు, త్రిష కొత్త డాగీ పేరు క్యాడ్‌బరీ జూనియర్‌ క్రిష్ణన్‌. త్రిష పూర్తి పేరు తెలుసు కదా, త్రిషా క్రిష్ణన్‌ అని. అందుకే ఇది క్యాడ్‌బరీ జూనియర్‌ క్రిష్ణన్‌ అయ్యిందన్నమాట.

Show comments