క్రమశిక్షణ: తన్నుకుంటున్న 'తమ్ముళ్ళు'

క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ.. అంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 'బుకాయించడం' మామూలే.. తెలుగు తమ్ముళ్ళు, క్రమశిక్షణకు తిలోదకాలిచ్చేసి తన్నుకోవడమూ మామూలే. వాళ్ళలో వాళ్ళే తన్నుకోవడం ఒక ఎత్తయితే, ఇంకొకరి మీద దాడికి దిగడం మరో ఎత్తు. దటీజ్‌ తెలుగుదేశం పార్టీ. 

ప్రకాశం జిల్లాలో టీడీపీ సీనియర్‌ నేత కరణం బలరాం అనుచరులకీ, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కీ మధ్య పచ్చ గడ్డి వెయ్యకుండానే భగ్గున మండిపోతోన్న పరిస్థితి. ఈ మధ్యనే గొట్టిపాటి వర్గం, కరణం వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని హతమార్చింది. ముఖ్యమంత్రి రంంగలోకి దిగి, ఇద్దర్నీ శాంతింపజేసే ప్రయత్నమైతే చేస్తున్నారుగానీ, ఆ ప్రయత్నం సఫలమవడంలేదు. ఈ ఎపిసోడ్‌లో కరణం బలరాం వర్గీయులే ఒకింత నిర్లక్ష్యానికి గురవుతున్నారన్నది నిర్వివాదాంశం. అలాగని, గొట్టిపాటి పండగ చేసుకోవడానికి వీఏల్లదు. ఇది చంద్రబాబు మార్క్‌ రాజకీయం అంతే. 

గొట్టిపాటి వర్గంపై 'రౌడీమూక' అనే ముద్రపడేలా పరిణామాల్ని చంద్రబాబు 'డైవర్ట్‌' చేస్తోంటే, కరణం బలరాంపై సానుఫభూతి క్రియేట్‌ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ కరణం సంబరాలు చేసుకోవడానికి వీల్లేని పరిస్థితి. గొట్టిపాటి వర్గానికి తెరవెనుక మద్దతిస్తూ, కరణం వర్గం దూకుడుకి కళ్ళెం వేస్తున్నారన్నమాట. 

ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు.. ఇలా ఒకరేమిటి, అధికారులపై విరుచుకుపడ్డంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. అవి చాలక తమలో తాము కుమ్ములాడుకుంటున్నారు. అధికారంలో వుంటే మాత్రం ఇంత బరితెగింపా.? అని ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకున్నట్లే. ఇది చంద్రబాబు రాజ్యాంగం. 

Show comments