కేసుల బాధ‌ బాబుకు కూడా తెలియాలి.

రాష్ట్ర రాజ‌కీయాల్లో ఇప్పుడు వేడి పుట్టిస్తున్న వార్త జ‌గ‌న్, మోదీ భేటీ. అత్యంత ర‌హ‌స్యంగా జ‌రిగిన వీరిరువురి స‌మావేశంలో ఏం మాట్లాడుకుని ఉంటార‌నేదే రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం ప్ర‌ధాన చ‌ర్చ‌. ఆ పార్టీ..ఈ పార్టీ అని లేదు అన్ని పార్టీల నాయ‌కులు ఇప్ప‌డు ఇదే అంశం మీద ఆరా తీస్తున్నారు. అటు వైసీపీ, ఇటు బీజేపీ కీల‌క నేత‌ల‌కు కూడా జ‌గ‌న్ ఏకాంతంగా మోదీతో ఏం మాట్లాడ‌డ‌నేది ఇత‌మిద్ధంగా తెలియ‌దు.

మోదీ, జ‌గ‌న్ భేటీపై అంద‌రికంటే ఎక్కువ‌గా ఆందోళ‌న ప‌డుతున్న తెలుగుదేశం నేత‌లు మాత్రం ఢిల్లీలోని త‌మ నేత‌ల ద్వారా అంతో ఇంతో స‌మాచారం తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే వారి ఆరాలో వెలువ‌డుతున్న విష‌యాలు మాత్రం టీడీపీ వ‌ర్గాల‌ను తీవ్రంగా క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.జ‌గ‌న్ ప్ర‌ధానంగా మోదీ ద‌గ్గ‌ర ప్ర‌స్తావించిన విష‌యం చంద్ర‌బాబు అవినీతి, అవ‌కాశ‌వాదం, అక్ర‌మాలే. మోదీతో తొలిసారిగా తీరిగ్గా మాట్లాడేందుకు అందివ‌చ్చిన అవ‌కాశాన్ని నేర్పుగా వినియోగించుకున్న జ‌గ‌న్ చెప్పాల్సిందంతా చెప్పాడు.

పోల‌వ‌రం, ప‌ట్టిసీమ ఇలా అన్ని కాంట్రాక్టులు త‌న వారికి ఇప్పించుకుని వంద‌ల కోట్లు సంపాదిస్తున్నాడు. అగ్రిగోల్డ్ కుంభ‌కోణాన్ని త‌న‌కు అనువుగా మార్చుకుని సొమ్ము చేసుకున్నాడు. గ‌నులు, ఇసుల ఇలా రాష్ట్రంలోని స‌హ‌జ వ‌న‌రుల‌న్నీ అనుచ‌రుల‌కు రాసిచ్చాడు. ఇలా అక్ర‌మంగా ఆర్జించిన సొమ్మును ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గ‌తంలో క‌నీవినీ ఎరుగ‌ని రీతి ఖ‌ర్చు చేశాడు.

మా పార్టీ ఎమ్మెల్యేల‌ను భారీ న‌జ‌రానాల‌తో కొనుగోలు చేశాడు. ఇంత చేస్తున్నా మేమేదైనా మాట్లాడితే అవినీతిప‌రుడికి మాట్లాడే అర్హ‌త లేదంటూ రోజుకు నాలుగు సార్లు పార్టీ నేత‌ల చేత తిట్టిస్తూ అనుకూల మీడియాలో హైలైట్‌గా ప్ర‌చురించుకుంటున్నాడు. ఆర్థిక ఉగ్ర‌వాది అంటూ ప‌డిక‌ట్టుప‌దాలతో మీడియా ద్వారా నిత్యం నాపై  విష‌ప్ర‌చారం చేస్తున్నాడు.

కాంగ్రెస్ పార్టీ సీబీఐని ఎలా వాడ‌కుందో మీకు తెలుసు. లాలూ, ములాయం, మాయావ‌తి..ఇలా త‌న‌కు ఎదురుతిరిగిన వారంద‌రినీ సీబీఐ కేసులు పెట్టి లొంగ‌దీసుకున్న సంగ‌తి తెలుసు. కానీ నేను కేసుల‌ను ఎదుర్కొన్నాను గానీ సోనియాకు లొంగిపోలేదు. కానీ ఇదే బాబు త‌న‌పై ఉన్న కేసుల విష‌యంలో ఆనాడు బ‌ద్ద‌శ‌త్రువైన కాంగ్రెస్ తో చేతులు క‌లిపి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ద్వారా చిదంబ‌రాన్ని క‌లిసి అరెస్ట్ నుంచి త‌ప్పించుకుని..పెద్ద నీతిమంతుడిలాగా నిప్పు అని చెప్పుకుంటూ ఫోజ‌లు కొడుతున్నాడు. ఇలాంటి బాబుకు కూడా కేసులు, అరెస్ట్‌ల బాధేంటో తెలియాలి.

నేను అనుభ‌వించిన మ‌నోవ్య‌ధ‌లో కొంచెమైనా ఆయ‌నా అనుభ‌వించాలి. అలా జ‌రిగితే నా ప‌రోక్ష మద్ధ‌తు ఎప్పుడూ మీకు ఉంటుంది. బాబు లాగా మాట‌మార్చే వ్య‌క్తిని కాదు నేను...ఇదీ మోదీతో జ‌గ‌న్ చెప్పుకున్న విష‌యాల సారాంశం. దీనికి ప‌ర్యావ‌స‌నంగానే ఇప్పుడు రాష్ట్రంలో కొంద‌రి ఇళ్ల‌పై సీబీఐ దాడులు, మ‌రికొంద‌రి అరెస్టులు.

అయితే చంద్ర‌బాబు, జ‌గ‌న్ మ‌ధ్య వైరానికి మోదీకి ఏమి సంబంధం. ఆ రోజు కాంగ్రెస్ చేసిన త‌ప్పు ఇప్పుడు త‌నెందుకు చేయాలి. కాబ‌ట్టి చంద్ర‌బాబుపై కేసులు, అరెస్ట్‌లు ఉండ‌క‌పోవ‌చ్చు. అయితే ఇక‌పై జ‌గ‌న్‌ను ప‌దే ప‌దే అవినీతి ప‌రుడు అంటే మాత్రం మీకు కూడా అలాంటి అవ‌మానం త‌ప్ప‌దు. రాజ‌కీయంగా ఏమైనా ఉంటే చూసుకోండి. ప్ర‌తిప‌క్షం మాట్లాడే ప్ర‌తిదానికీ జ‌గ‌న్ అవినీతిప‌రుడంటే ఝ‌ల‌క్‌ త‌ప్ప‌ద‌ని టీడీపీకి హెచ్చ‌రిక‌లు జారీచేశాడు మోదీ.

అఫ్‌కోర్స్ ఇక‌పై బీజేపీ నేత‌లు ఎలాగూ జ‌గ‌న్‌ను ఏ అంశంలోనూ విమ‌ర్శించ‌రనుకోండి. మ‌రి రాజ‌కీయంగా ఇంత క్లిష్ట‌ప‌రిస్థితిని బాబు ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. అన్న‌ట్టు బాబు త‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌పై శ‌నివారం సాయంత్రం మీడియాతో మాట్లాడ‌నున్నాడు. మోదీతో జ‌గ‌న్ భేటీ అంశంపై బాబు ఈ సంద‌ర్భంగా ఎలాంటి కామెంట్ చేయ‌డ‌ని టీడీపీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

Show comments