ఆనం మోసపోయారట

తెలుగుదేశం పార్టీలోకి కొన్నాళ్ల క్రితం వలసలు క్యూ కట్టాయి. ఇలా క్యూ కట్టిన వాళ్లందరి నోటా ఒకటే మాట. తమ నియోజక వర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాం అని. అంటే ప్రతి పక్షంలో నియోజకవర్గం అభివృద్ధి చెందదన్న మాట. కానీ ఇలా వెళ్లినవాళ్లంతా వెంటనేనో, కాస్త ఆలస్యంగానో పదవులు దక్కించుకున్నవాళ్లే.

అప్పుడే జనాలకు అర్థం అయింది వలసల అసలు పరమార్థం అదే అని. ఆదినారాయణ రెడ్డి, భూమా కుటుంబం, జ్యోతుల ఫ్యామిలీ ఇలా ఒక్కొక్కళ్లకి ఏదో ఒకటి ఇచ్చి సంతృప్తి పరుస్తూ వస్తున్నారు. కానీ ఏదీ దక్కని వాళ్లు ఇప్పడు అసలు మాట వెళ్ల గక్కుతున్నారు.

లేటెస్ట్ గా నెల్లూరు ఆనం ఫ్యామిలీ తెరపైకి వచ్చింది. ఎవరెవరికో పదవులు ఇస్తున్నారు. తమకు అవమానాలే మిగుల్తున్నాయి (అంటే పదవి ఇవ్వకపోవడం అవమానం అన్నమాట), మోసపోయాను, నెల్లూరు ఏ పదవీ లేకుండా వచ్చి, కార్యకర్తలకు మొహం చూపించలేను అంటున్నారట ఆనం వివేకానంద రెడ్డి.

ఆయన పరిస్థితి ఎలా వుందంటే, వాళ్లకు సంబంధించిన జూనియర్ కాలేజీ ఫంక్షన్ కు కూడా ఆయనకు ఆహ్వానం అందలేదట. మంత్రి నారాయణ తదితరుల ఆధిపత్యం ఆ రేంజ్ లో వుందట నెల్లూరులో. అలాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అని అది కూడా ఇవ్వలేదట.

పాపం, ఆనం బ్రదర్స్ ఏవేవో ఆశించి తెలుగుదేశం పార్టీలో చేరారు. పైగా పోతూ పోతూ జగన్ ను వీలయినన్ని మాటలు అని మరీ వెళ్లారు. వెళ్లాక ఎన్ని విమర్శలు చేయాలో అన్నీ చేసారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే పరిస్థితి ఇలా వుంది? ఆ మాటకు వస్తే ఆనం పరిస్తితే కాదు, ఫిరాయించిన వాళ్లలో చాలా మంది పరిస్థితి ఇదే. పైకి చెప్పుకోలేక, మింగలేక కిందా మీదా అవుతున్నారు.

Show comments