బేవాచ్ బ్యూటీకి మరో 2 సినిమా ఆఫర్లు

హాలీవుడ్ లో బేవాచ్ సినిమా ఫ్లాప్ అయింది. అందులో స్మూత్ విలన్ గా నటించిన ప్రియాంక చోప్రా యాక్టింగ్ కు కూడా నెగెటివ్ మార్కలు పడ్డాయి. కానీ ఆమె అందచందాలు, మరీ ముఖ్యంగా ఆమె బికినీ లుక్స్ మాత్రం హాలీవుడ్ లో కొందర్ని బాగా ఎట్రాక్ట్ చేశాయి. ఆ అందాలే ఇప్పుడు ప్రియాంకకు మరో 2 హాలీవుడ్ ఆఫర్లు తెచ్చిపెట్టాయి.

2 నెలల్లో సెట్స్ పైకి రాబోతున్న "ఎ కిడ్ లైక్ జేక్" సినిమా కోసం ప్రియాంక చోప్రాను సంప్రదించారు మేకర్స్. రొమాంటిక్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో నటించేందుకు ప్రియాంక చోప్రా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

మరోవైపు సరికొత్త కామెడీ ఎంటర్ టైనర్ కాన్సెప్ట్ తో రానున్న "ఈజ్ ఇట్ రొమాంటిక్" అనే మరో సినిమాలో కూడా ప్రియాంక చోప్రా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ రెండు సినిమాల్లో ఆమెకు ఎలాంటి పాత్రలు ఆఫర్ చేస్తున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. బేవాచ్ లో నెగెటివ్ ఛాయల్లో కనిపించిన ప్రియాంక, ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుందా లేక  కీలకమైన పాత్రల కోసం తీసుకున్నారా అనేది ఇంకా తేలలేదు.

మరోవైపు ప్రియాంక భజన బృందం మాత్రం ఆమెకు ఎన్నో ఆఫర్లు వస్తున్నాయని, వాటిలోంచి ఈ ఆఫర్లు మాత్రమే ఆమె సెలక్ట్ చేసుకుందని గొప్పలు చెప్పుకుంటోంది.

Show comments